Dharani
ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ.. టీడీపీ నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు తమ అనుకూల మీడియా ద్వారా అసత్య ప్రచారాలకు దిగుతున్నారు. బడుగులపై పెత్తందారీతనం అంటూ తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ.. టీడీపీ నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు తమ అనుకూల మీడియా ద్వారా అసత్య ప్రచారాలకు దిగుతున్నారు. బడుగులపై పెత్తందారీతనం అంటూ తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు.
Dharani
అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వెనబడిన వర్గాల వారు ఆర్ధికంగా, సామాజికంగానే కాక.. రాజకీయంగా కూడా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.. ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలానే ఆయన అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాల వారి కోసం రకరకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. అంతేకాక నామినేటెడ్ పదవుల్లో సైతం అత్యధిక భాగం వారికే కేటాయించారు. బడుగు, బలహీన వర్గాల వారికి జగన్ ప్రభుత్వంలో లభించినన్ని పదవులు, సీట్లు.. చంద్రబాబు హయాంలో లభించిన దాఖలాలు లేవు. చంద్రబాబు దృష్టిలో బడుగు వర్గాలు కేవలం ఓటు బ్యాంకు మాత్రమే. తాను అధికారంలోకి రావడానికి వారి ఓట్లు కావాలి.. కానీ గెలిచాక వారికి సీట్లు, పదవులు ఇవ్వడానికి బాబుకు మనసు రాలేదు.. రాదు కూడా.
ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఏనాడు బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమం పట్టలేదు. పైగా ఆ పార్టీ నేతలు అనేక సందర్భాల్లో వారిని కించపరుస్తూ అనేక పరుష వ్యాఖ్యాలు చేశారు. ఎస్టీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు.. దళితులకు ఎందుకు రాజకీయాలు, వారు అసలు చదువుకుంటారా అంటూ టీడీపీ నేతలు అనేక సందర్భాల్లో.. వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. అప్పుడు చంద్రబాబు మాత్రమే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా దీనిపై స్పందించలేదు. మాటలు, చేతలు ద్వారా బడుగు, బలహీన వర్గాలపై పెత్తందారీతనం చూపింది టీడీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలు. ఇది జగమెరిగిన సత్యం.
బడుగు, బలహీన వర్గాలు అంటేనే చిన్న చూపు చూసే చంద్రబాబు.. ఎన్నికల ముందు మాత్రం.. వారిపై తెగ ప్రేమ ఒలకబోస్తున్నాడు. తన అనుకూల మీడియా ద్వారా.. ముఖ్యమంత్రి జగన్ మీద బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారు. బడుగులకి అటు క్యాబినెట్‌లో కానీ.. ఇటు రాష్ట్రంలో కానీ పెద్ద పీట వేసింది సీఎం వైయస్ జగన్. కానీ టీడీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలు.. తమ అనుకూల మీడియా ద్వారా నిసిగ్గుగా అబద్దాలు ప్రచారం చేయిస్తున్నారు. బడుగులకు జగన్ ఏం చేశారో.. ఆయన గత నిర్ణయాలు మాత్రమే కాక.. తాజాగా నియమించిన 50 మంది సమన్వయకర్తల నియామకం పరిశీలించినా అర్థం అవుతుంది. ఈ 50 మందిలో 14 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, 16 మంది బీసీలు, నలుగురు మైనారిటీలు, 13 మంది ఓసీలు ఉన్నారు.
సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల వారికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో దీన్ని చూస్తేనే అర్థం అవుతుంది. 50 మంది సమన్వయకర్తల్లో 37 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం ఇస్తే.. అది బడుగులను పల్లకి ఎక్కించడం అవుతుంది కానీ.. వారిపై పెత్తందారీతనం చూపడం ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు. అలానే లోక్‌సభ స్థానాలకు నియమించిన 9 మంది సమన్వయకర్తల్లో బీసీలు ఆరుగురు ఉండగా, ఎస్సీ వర్గానికి చెందిన వారు ఒకరు, ఎస్టీ ఒకరు, ఓసీ ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారు సీఎం జగన్.
ఈ 9 మందిలో ఎనిమిది మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. ఒక్కరే ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కరే. సమన్వయకర్తల నియామకంలో.. బడుగు, బలహీన వర్గాల వారికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తుండగా.. దాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు, తమ అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలను జనాలు కూడా తప్పు పడుతున్నారు. ఇంకెంత కాలం బురదలు రాస్తారని ప్రశ్నిస్తున్నారు. అసలు బాబు మారడా అని చర్చించుకుంటున్నారు.