అమర్నాథ్‌ కుటుంబాన్ని ఆదుకున్న చంద్రబాబు నాయుడు.. భారీ ఆర్థిక సాయం!

అమర్నాథ్‌ కుటుంబాన్ని ఆదుకున్న చంద్రబాబు నాయుడు.. భారీ ఆర్థిక సాయం!

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఉప్పలవారిపాలెంలో పదవ తరగతి విద్యార్థి అమర్నాథ్‌ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. సోమవారం అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. అంతేగాక, బాధిత కుటుంబాన్ని టీడీపీ అన్ని విధాల ఆదుకుంటుందని.. తెలిపారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించారు చంద్రబాబు.

అంతేకాక అమర్నాథ్ సోదరిని చదివించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డల్ని కాపాడే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. కాగా, ఇటీవల బాపట్ల జిల్లాలో నిందితులు.. అమర్నాథ్‌పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. బాధితుడు చనిపోయే ముందు నిందితుల పేర్లు చెప్పడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టాంచింది. పదో తరగతి బాలుడిపై ఇంత దారుణంగా దాడి చేయడం ఆందోళన కలిగించింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అమర్నాథ్‌ సోదరికి ఈ రూ. 10 లక్షలు ధైర్యాన్ని ఇవ్వలేవు. రాష్ట్రంలో గంజాయి, నేర సంస్కృతి పోతేనే.. అమ్మాయిలకు రక్షణ అని తెలిపారు. వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తే.. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని తెలిపారు. అమర్నాథ్‌ సోదరికి ధైర్యం చెప్పడానికే తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఇప్పటి వరకు వారికి శిక్షపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్‌ సోదరి బాగా చదివి.. ఇలాంటి వెధవలకు బుద్ది చెప్పాలని.. అందుకే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరఫున ఆమెను దత్తత తీసుకుంటున్నామని.. ఆమెను చదివించే బాధ్యత తనదేనని తెలిపారు.

Show comments