Dharani
ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. తాజా రాజకీయాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ నిర్ణయాలు.. గందరగోళంగా ఉన్నాయన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన అంశాలు ఇలా ఉన్నాయి...
ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. తాజా రాజకీయాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ నిర్ణయాలు.. గందరగోళంగా ఉన్నాయన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన అంశాలు ఇలా ఉన్నాయి...
Dharani
కులం పేరుతో రాజకీయాలేంటి.. అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబుకు కులం ప్రాతిపదికన సానుభూతి తెలిపే విధానం వల్ల ఎంత నష్టం జరుగుతుంతో ఆలోచించారా.. కమ్మ రంగు అందరికి పులమడం సరికాదు.. అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు, తెలుగు సినీ కార్మికుల నేతగా ప్రసిద్ధి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ. ప్రజలను తికమక పెట్టే రాజకీయాలు.. ఇబ్బందులు సృష్టించే నాయకులను ఈసారి ఎన్నికల్లో చూడబోతామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న పబ్లిక్ మూడ్ మొదలుకొని, మారుతున్న రాజకీయాలు సహా పలు అంశాలపై తమ్మారెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. అలానే చంద్రబాబు, పవన్ రాజకీయాల మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘‘పవన్‌కల్యాణ్ రాజకీయం చూస్తే ఆశ్చర్యంతో పాటు.. అనుమానాలు కలిగిస్తోంది. ఏపీలో టీడీపీతోనే ఉంటానంటాడు.. బీజేపీని వదిలేస్తానంటాడు. అదే తెలంగాణకు వచ్చే సరికి.. బీజేపీకి మద్దతిస్తాడు.. కలిసి పోటీ అంటాడు. ఈ తికమక ఏంటో అర్థం కావడం లేదు. పైగా అవినీతి కేసులో చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాతే కదా… జనసేన, టీడీపీ పొత్తు బంధం బయటకొచ్చింది. చంద్రబాబు జైలు నుంచి రాగానే పవన్‌కే కృతజ్ఞతలు తెలిపారు. ఇదేంటి.. అంటే పవన్.. బాబు అవినీతికి మద్దతుగా ఉంటాడా’’ అని ప్రశ్నించారు.
‘‘పవన్ తీరు ఇలా ఉంటే.. తెలంగాణలో తన కేడర్ ఏ పార్టీ వైపు ఉండాలనేది చంద్రబాబు చెప్పడు. టీడీపీ అయినా జనసేన అయినా అంతా తానే అని చెప్పే పవన్ ఇంకా వ్యూహం ఖరారు చేయలేదు. పవన్, చంద్రబాబు ఎవరి మాట ఎవరు వింటారో గానీ… తెలంగాణ ఎన్నికల్లో ఒకే వ్యూహంతో వెళ్లగలరా. వీరి నిర్ణయాలు జనాలను మాత్రమే కాక.. వారి పార్టీ నేతలను కూడా గందరగోళపరుస్తున్నాయి’’ అని చెప్పుకొచ్చారు.
‘‘తెలంగాణ ఏర్పడిన ప్రారంభంలో.. ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న స్థానికేతరులు కొంత భయాందోళనకు గురైన మాట వాస్తవం. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు.. ఇప్పుడు అందరూ కలిసిపోయారు. సెటిలర్స్ ఇక్కడ సంతోషంగా ఉన్న సమయంలో.. చంద్రబాబు అరెస్టు తర్వాత కొంతమంది మళ్లీ ఈ విభజన రేఖ తెస్తున్నారు. ఈ అంశాన్ని ఓ సామాజికవర్గం నెత్తికెత్తుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. సెటిలర్స్ అనేది మానిపోయిన గాయం. కానీ కొంతమంది తమ ప్రయోజనాల కోసం మళ్లీ దాన్ని రేపుతున్నారు’’ అని మండి పడ్డారు.
‘‘సెటిలర్స్ పేరుతో చంద్రబాబు వ్యవహారంపై నిరసనలేంటి.. సెటిలర్స్‌లో కమ్మవాళ్లే ఉన్నారా.. ఇక్కడ సెటిల్ అయిన వారిలో అన్ని సామాజిక వర్గాలు వారు ఉన్నారు. కుల ప్రతిపాదికన ఇలా నిరసన తెలపడం ఎంత వరకు కరెక్ట్.. అందరికి కమ్మ రంగు పులమడం సరికాదు.దివంగత ఎన్టీఆర్ కూడా టీడీపీని కేవలం ఒక సామాజికవర్గానికే పరిమితం చేయలేదని చెప్పారు. ఇలాంటి రాజకీయాలు చూస్తే రోత పుడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.