iDreamPost
android-app
ios-app

హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది, రాజధాని కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

  • Published Nov 28, 2022 | 2:42 PM Updated Updated Nov 28, 2022 | 2:42 PM
హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది, రాజధాని కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

రాజధాని కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాజధాని కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టే ప్రభుత్వం అయితే.. అక్కడ ప్రభుత్వం ఎందుకు ? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా ? అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రికరిస్తే ఎలా ? హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని సుప్రీం వ్యాఖ్యనించింది. 6 నెలల్లో అమరావతి పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో 3 నుంచి 7 అంశాల వరకు సుప్రీంకోర్టు స్టే విధించింది.

1. AP CRDA 2015 లాండ్‌ పూలింగ్‌ షెడ్యూల్ 2 మరియు 3 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, CRDA నిర్వర్తించాలి

2. థర్డ్‌ పార్టీ ప్రయోజనాలకు పూలింగ్‌ లాండ్‌ తనఖా పెట్టరాదు. రాజధాని నిర్మాణం, కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌కు తనఖా పెట్టవచ్చు

3. CRDA యాక్ట్‌ సెక్షన్‌ 58 ప్రకారం రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు తీర్పు వచ్చిన తేదీ నుంచి నెలరోజుల్లో పూర్తిచేయాలి

4. APCRDA యాక్ట్‌ సెక్షన్‌ 61 ప్రకారం టౌన్‌ మాస్టర్‌ ప్లానింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, CRDA కలిసి పూర్తి చేయాలి

5. డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఫామ్‌ 9.14 ప్రోవిజన్‌ – CRDA యాక్ట్‌ 2015లోని నిబంధనల ప్రకారం 6 నెలల్లో అమరావతి కేపిటల్‌ సిటీ, కేపిటల్‌ రీజియన్‌ నిర్మాణం చేపట్టాలి

6. ప్రభుత్వం మరియు CRDA కలిసి రోడ్లు, తాగునీరు, ప్రతిప్లాట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌, డ్రైనేజి సహా ఏర్పాటు చేసిన అమరావతి కేపిటల్‌ సిటీ నివాసయోగ్యంగా మార్చాలి

7. రాష్ట్ర ప్రభుత్వం మరియు APCRDA కలిసి భూములిచ్చిన రైతులకు ప్రామిస్‌ చేసినట్టుగా అమరావతి కేపిటల్‌ రీజియన్‌లో స్థలాలు 3 నెలల్లోగా కేటాయించాలి

రాష్ట్రప్రభుత్వం మరియు CRDAలు అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు వేర్వేరు అఫిడవిట్లు సమర్పించాలి.

హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు అయ్యేలా చూడాలంటూ రైతులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషనలను విచారించిన సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు నెలల్లో రాజధానిని నిర్మాణాలను పూర్తి చేయాలన్న హైకోర్టు కాలపరిమితిపై సుప్రీం స్టే విధించింది.