చేవెళ్లలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో వరాలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రజా గర్ణన పేరుతో శనివారం చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వచ్చారు. ఇక రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ సభ వేదిక నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ యువతకు వరాల జల్లు కురిపించారు. మొత్తం 12 అంశాలతో డిక్లరేషన్ రూపొందిచినట్లు తెలుస్తుంది. ఈ డిక్లరేషన్ తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 రిజర్వేషన్లు పెంచుతామని కూడా ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇంతకు కాంగ్రెస్ ప్రకటించిన ఈ డెక్లరేషన్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ప్రధాన అంశాలు:

  • ప్రధానంగా డిక్లరేషన్ లో రూ.12 లక్షలతో దళిత బంధు
  • అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం
  • 10వ తరగతి పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10 వేలు
  • ఇంటర్ పాసైన వారికి రూ.15 వేలు, డిగ్రీ పాసైన వారికి రూ. లక్ష
  • ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 రిజర్వేషన్లు పెంపు
  • ప్రతి మండలానికి గురుకుల పాఠశాల
  • విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందని విద్యార్థులకు ఆర్థిక సాయం
  • ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలతో ఈ డిక్లరేషన్ ను ప్రకటించారు.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ నేత తుమ్మల కంటతడి.. మళ్లీ హీటెక్కిన ఖమ్మం రాజకీయం!

Show comments