iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. పవన్ వింత పోస్ట్ వైరల్!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు బెయిల్ పై రావడంపై పవన్ కల్యాణ్ చేసిన పోస్టు పలు విమర్శలకు తావిస్తోంది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు బెయిల్ పై రావడంపై పవన్ కల్యాణ్ చేసిన పోస్టు పలు విమర్శలకు తావిస్తోంది.

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. పవన్ వింత పోస్ట్ వైరల్!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. 52 రోజులు రిమాండు ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు మధ్యంతర బెయిలు మీద విడుదలయ్యారు. చంద్రబాబు అనారోగ్య సమస్యల దృష్ట్యా మాత్రమే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిలును ఇచ్చింది. కేవలం కంటి ఆపరేషన్ కోసం మాత్రమే బెయిలు మంజూరు చేసినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు విడుదలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీటు వింతగా గోచరిస్తోంది.

నిజానికి ఆరోగ్య సమస్యల రీత్యా మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు బయటకు వస్తుంటే.. సంబరాలు చేసుకోవడమే కాస్త వింతగా అనిపిస్తోందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ చేసిన పోస్ట్ మరింత వింతగా ఉందంటున్నారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ చేసిన పోస్టుపై తిరిగి ప్రశ్నలు సంధిస్తున్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం వెనుక కోర్టు ఉద్దేశం ఏంటి? అసలు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ పక్కన పెడితే అసలు పవన్ కల్యాణ్ పోస్టుకు అర్థం ఏంటి? అంటూ నెట్టింట పలు ప్రశ్నలు, సెటైర్లు వినిపిస్తున్నాయి.

అసలు చంద్రబాబు విడుదలపై పవన్ కల్యాణ్ చేసిన పోస్టు ఏంటంటే.. “తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో.. ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు నాయుడు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం” అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ స్వాగతంపైనే ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు. ఆయన కేవలం ఆరోగ్య సమస్యల వల్లే మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు అనే విషయాన్ని పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు. షరతులతో కూడిన బెయిల్ పై వచ్చారు. కేవలం ఆస్పత్రికి, ఇంటికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

మీడియా, రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనకూడదు అని చెప్పారు. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని కూడా తెలియజేశారు. నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోపు తిరిగి పోలీసులకు సరెండర్ అవ్వాలి. ఇలా మధ్యంతర బెయిల్ పై వచ్చిన వ్యక్తి ప్రజా సేవలో మమేకం అవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైనప్పుడు చేయాల్సిన పోస్టును పవన్ కల్యాణ్ ముందే చేశారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంక చంద్రబాబు బెయిల్ విషయానికి వస్తే.. ఆయన ఏ ఆస్పత్రిలోనైనా కంటికి ఆపరేషన్ చేయించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు చికిత్స వివరాలను సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కు అప్పగించాలని ఆదేశించారు. మరి.. చంద్రబాబు మధ్యంతర బెయిలుపై విడుదల కావడంపై పవన్ చేసిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.