Dharani
భువనేశ్వరి యాత్ర చెపట్టబోతున్నారు అని తెలిసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ సాగుతుంది. పైగా నెటిజనుల నుంచి భువనేశ్వరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్ కూడా వస్తుంది. ఇంతకు అది ఏంటి అంటే..
భువనేశ్వరి యాత్ర చెపట్టబోతున్నారు అని తెలిసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ సాగుతుంది. పైగా నెటిజనుల నుంచి భువనేశ్వరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్ కూడా వస్తుంది. ఇంతకు అది ఏంటి అంటే..
Dharani
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో.. కనీసం కలలో కూడా ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. తాను ఎన్ని అక్రమాలు చేసినా సరే.. అనుకూల మీడియా సాయం, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని.. తప్పించుకుని తిరిగిన చంద్రబాబుకి జగన్ సర్కార్ కోలుకోలేని రీతిలో భారీ షాక్ ఇచ్చింది. చంద్రబాబు హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో వందల కోట్ల రూపాయాల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో ప్రస్తుతం చంద్రబాబు రాజమండి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఆయన జైలుకి వెళ్లి 40 రోజుల పైనే అవుతోంది. అయితే తన జీవితంలో జైలు దరిదాపుల్లోకి కూడా వెళ్తానని చంద్రబాబు ఎప్పుడు అనుకోని ఉండరు. కానీ ఎన్ని మోసాలు చేసినా సరే.. నిజం ఏదో ఒక రోజు ముందుకు వస్తుంది. ఆ రోజు దాన్ని ఎదుర్కొక తప్పదు. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరుగుతుంది అంటున్నారు జనాలు.
అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడు. ఈక్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో.. చంద్రబాబు కుటుంబంలోని మహిళలు బయటకు రావాల్సి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీటన్నింటిలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. అయితే టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు జనాల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఈ క్రమంలో భువనేశ్వరి.. నిజం గెలవాలి నినాదంతో జనాల్లోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.
భువనేశ్వరి యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే.. చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక.. తీవ్ర ఆవేదనతో ప్రాణాలు విడిచిన బాధితుల కుటుంబాలను ఆమెని పరామర్శించున్నారు. వారంలో కనీసం రెండు, మూడు చోట్ల భువనేశ్వరి పర్యటించేలా టీడీపీ షెడ్యూల్ ఖరారు చేస్తోంది. అయితే టీడీపీ నిజం గెలవాలి నినాదం ఇచ్చిన నాటి నుంచి దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అవును నిజం గెలవాలి.. గెలుస్తుంది కూడా.. అందుకే చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు.. ఆయన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.. నిజమే ఇప్పుడు నిజమే గెలుస్తుంది అంటున్నారు నెటిజనులు.
అంతేకాక భువనేశ్వరి పరామర్శించాలనుకుంటే.. ముందుగా లక్ష్మీపార్వతినే పరామర్శించాలి.. ఆ తర్వాత మిగతా వారి సంగతి చూడాలి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. చంద్రబాబు అరెస్ట్ వల్ల మనస్తాపం చెంది ఎవరైనా మరణించారో లేదో తెలియదు కానీ.. బాబు పొడిచిన వెన్నుపోటును జీర్ణించుకోలేక.. మీ కన్నతండ్రి ప్రాణాలు కోల్పోయాడు.. కనుక ఆయన భార్య లక్ష్మీపార్వతినే మీరు ముందుగా పరామర్శించాలి అప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది అని ఎద్దేవా చేస్తున్నారు నెటిజనులు. ముందు లక్ష్మీపార్వతినే కలవండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు నెటిజనులు.