iDreamPost
android-app
ios-app

వీడియో: టికెట్ దక్కిన ఆనందంలో బోరున ఏడ్చిన BRS అభ్యర్థి

వీడియో: టికెట్ దక్కిన ఆనందంలో బోరున ఏడ్చిన BRS అభ్యర్థి

ఎప్పుడెప్పుడా అని అంతా ఎంతో అతృతగా ఎదురు చూసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా సోమవారం విడుదలైంది. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే మొదటి లీస్ట్ లో పేర్లు వచ్చిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.., టికెట్ రానివారు షాక్ గురై బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ములుగు నియోజకవర్గానికి సంబంధించి BRS అభ్యర్థిగా బడే నాగజ్యోతి పేరును ప్రకటించారు. మొదటి జాబితాలో ఆమె పేరు ఉందని టీవీల్లో చూసి అభ్యర్థి బడే నాగజ్యోతి సంతోషం వ్యక్తం చేశారు.

ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు రావడంతో ఆమె భావోద్వేగానికి గురై బోరున ఏడ్చారు. ఇక ఏడుస్తూనే తన తండ్రి ఫోటోకు నమస్కరించారు. ఇకపోతే.. బడే నాగజ్యోతి ప్రస్తుతం ములుగు జెడ్పి చైర్మన్ గా కొనసాగుతున్నారు. మొత్తానికి టికెట్ ఆమెకే దక్కడంతో పట్టలేని ఆనందంలో మురిసిపోయారు. ఇక ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలని ఆమె భావిస్తున్నారట. మరో విషయం ఏంటంటే? సీతక్క అలియాస్ దనసరి అనసూయ ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఎదిగిన ఆమె.. ప్రజల్లో కూడా మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆదివాసీ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా.. ఎమ్మెల్యే సీతక్క అక్కడ వాలిపోతుంటారు. కొండలు, కోనలు లెక్కచేయకుండా ప్రజలను కలుసుకుని వారి బాగోగులు తెలుసుకుంటుంటారు. అయితే బలమైన నేతగా ఉన్న ఎమ్మెల్యే సీతక్కను ఓడించి ఈసారి ఎలాగైన అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారట ములుగు BRS అభ్యర్థి బడే నాగజ్యోతి. ఇక టికెట్ దక్కిన ఆనందంలో బోరున ఏడ్చేసిన బడే నాగజ్యోతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Namasthe Telangana (@namasthe_telangana)

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. టికెట్ రానివారి గురించి కేసీఆర్ కామెంట్స్!