Dharani
ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆళ్లగడ్డలో టీడీపీ నేతలు ఒకరికి ఒకరు వార్నింగ్ ఇచ్చుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆళ్లగడ్డలో టీడీపీ నేతలు ఒకరికి ఒకరు వార్నింగ్ ఇచ్చుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
Dharani
మరి కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 175కి 175 స్థానాల్లో గెలుపొంది.. మరోసారి అధికారం చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల పనులు ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపుకు సంబంధించి చర్యలు వేగవంతం చేశారు. అధికార పార్టీ అప్పుడే అభ్యర్థుల ప్రకటనకు రెడీ అవుతుంటే.. టీడీపీ-జనసేన కూటమి పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. టీడీపీతో పొత్తుని జనసేన నేతలే సమర్ధించలేకపోతున్నారు. పొత్తు ప్రకటన వెలువడిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. కొన్ని చోట్ల అయితే టీడీపీ, జనసేన నేతలు కొట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా టీడీపీకి బాగా పట్టున్న ఆళ్లగడ్డలో చంద్రబాబుకి కొత్త తలనొప్పి మొదలయ్యింది. ఆ వివరాలు..
రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన మధ్య ఇంకా సీట్ల పంపకమే ఓ కొలిక్కి రాలేదు. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే దానిపై ఆ పార్టీ నేతలకే అవగాహన లేదు. ఇదిలా ఉండగా.. నియోజవర్గాల్లో వర్గ పోరు బాబుని మరింత కలవరపెడుతుంది అంటున్నారు రాజకీయ పండితులు. టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో.. నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ ఒకటి. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో.. ఆళ్లగడ్డ టీడీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.
ఇక్కడ టీడీపీ కీలక నేతలు ఒకరికి ఒకరు వార్నింగ్‌లు ఇచ్చుకోవడం చూస్తే.. విభేదాలు ఎంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు సభ నేపథ్యంలో మరోసారి అవి తెర మీదకు వచ్చాయి.
ఇటీవల చంద్రబాబు సభ నేపథ్యంలో ఆళ్లగడ్డ టీడీపీలోని అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆళ్లగడ్డలో చంద్రబాబు సభకు సొంత పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, జనసేన నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి రాకూడదని మాజీ మంత్రి అఖిలప్రియ షరతు విధించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆహ్మానం లేకపోవడంతో చంద్రబాబు సభకు వెళ్లలేదని రాంపుల్లారెడ్డి తెలపగా.. టీడీపీ సూచనల మేరకే తాను చంద్రబాబు సభకు వెళ్లలదన్నారు ఏవీ సుబ్బారెడ్డి. అంతేకాక చంద్రబాబు సమక్షంలో అఖిలప్రియ ప్రసంగిస్తూ టీడీపీలో కోవర్టులున్నారని ఆరోపించారు. వాళ్లందరి అంతు చూస్తామని ఆమె హెచ్చరించడం సంచలనంగా మారింది.
అయితే దీనిపై ఏవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అఖిలప్రియ ఆరోపించిన కోవర్టు తానేనని చెప్పి.. ఆయన షాకిచ్చారు. అంతేకాక ఆళ్లగడ్డ సీటు తనకే అని చంద్రబాబు చెప్పాడంటూ అఖిలప్రియ ప్రచారం చేసుకోవడాన్ని ఏవీ సుబ్బారెడ్డి తప్పు పట్టారు. ఇదే సమయంలో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని చెప్పుకొచ్చారు ఏవీ సుబ్బారెడ్డి. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఆళ్లగడ్డలో తాను భారీ మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆళ్లగడ్డకు తాను వెళ్లాలని అనుకుంటే ఎవరూ అడ్డుకోలేరని హెచ్చరించారు. అంతేకాక అఖిలప్రియకు సీటు ఇస్తే మాత్రం సహకరించే ప్రసేక్తే లేదని ఆయన ఏవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పడం సంచలనంగా మారింది. దాంతో ఆళ్లగడ్డలో రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే సీట్ల పంపకం సహా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న చంద్రబాబు.. ఇప్పుడు సొంత పార్టీలోని విభేదాలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి అంటున్నారు విశ్లేషకులు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బాబు ఎవరిని బరిలో నిలుపుతారు అనేది రాజకీయవర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ విభేదాలు ఏ స్థాయికి చేరుకుంటాయో.. వీటిని బాబు ఎలా పరిష్కరిస్తాడో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు.