KTR ఇంట్రెస్టింగ్ ట్వీట్.. అందుకే మేం ఓడిపోయాం.. ఆ పని చేసుంటే గెలిచేవాళ్లం

బీఆర్ఎస్ ఓటమిపై స్పందిస్తూ.. కేటీఆర్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఆయన ఇప్పుడు ఎందకు స్పందించారు.. ఇంతకు ఏమన్నారంటే..

బీఆర్ఎస్ ఓటమిపై స్పందిస్తూ.. కేటీఆర్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఆయన ఇప్పుడు ఎందకు స్పందించారు.. ఇంతకు ఏమన్నారంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి.. సుమారు తొమిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ సారి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో కారు పార్టీని ఓడించి.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. హస్తం పార్టీ గెలవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరో మూడు రోజులు గడిస్తే.. తెలంగాణలో ఎన్నికలు ముగిసి నెల రోజులు అవుతుంది. ఇప్పటికే తాజా ఎన్నికల్లో.. బీఆర్ఎస్ పార్టీ ఓటమి గురించి ఇప్పటికే అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ ఓటమి గురించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణ రాజకీయ నాయకుల్లో.. సోషల్ మీడియా మరీ ముఖ్యంగా ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే నేత అనగానే అందరికి గుర్తుకు వచ్చేది.. మాజీ మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందించడమే కాక.. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు కేటీఆర్. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ ఓటమి గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఫలితాలు వచ్చిన ఇన్ని రోజుల తర్వాత.. కేటీఆర్ ఇప్పుడు ఎందుకు ఓటమి గురించి ట్వీట్ చేశారు.. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అని నెట్టింట జోరుగా చర్చించుకుంటున్నారు నెటిజనులు.

కేటీఆర్ ట్విటర్ వేదికగా బీఆర్ఎస్ ఓటమి గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రసుత్తం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలల నిర్మాణంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ స్పందిస్తూ.. “ఎన్నికల తర్వాత ఫలితాలకు సంబంధించి నాకు భిన్నమైన సమాచారం అందుతోంది. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే బాగుండేదంటూ వస్తున్న సూచన ఉత్తమమైంది. కేసీఆర్‌పై వస్తున్న అసత్య ప్రచారం, తప్పుడు వార్తలను ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఆలోచనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని ఉంటే అసత్య ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేది” అంటూ పరోక్షంగా తమ ఓటమికి కారణం ఇదే అన్నట్లు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ.. అవును కరెక్ట్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికంటే 32 యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని ఎవరో చెప్పుకొచ్చారు. ఆ విశ్లేషణను కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రకరకాల విశ్లేషణలు వింటున్నాయనని, అందులో ఇది కూడా ఒకటి అని ఆయన ఈ ట్వీట్ వేశారు. కొంతవరకు తాను కూడా ఈ వాదనను అంగీకరిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది. మరి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి.

Show comments