Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదన్న సంగతి తెలిసిందే. పోటీ నుంచి తప్పుకోవడంతో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌ల మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ వివరాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదన్న సంగతి తెలిసిందే. పోటీ నుంచి తప్పుకోవడంతో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌ల మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితమే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కాసాని జ్ఞానేశ్వర్.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేశాడు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయాలని భావించాడు. కానీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం.. పోటీ నుంచి తప్పుకోమని ప్రకటించాడు. బాబు నిర్ణయంపై కాసాని జ్ఞానేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అనంతరం మీడియా సమావేశంలో తన ఆవేదన చెప్పుకొచ్చాడు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకు అని ప్రశ్నించాడు. అంతేకాక.. ఎన్నికల్లో పోటీ గురించి చర్చించడం కోసం తాను లోకేష్‌కు 20 సార్లకు పైగా కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదని.. ఇలాంటి పద్దతి మంచిది కాదని అన్నాడు. అలానే పొత్తుల మీద కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కాసాని. ఆ వివరాలు..
ఈసందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఫైట్ చేయాలని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పోటీ చేయకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. బాలకృష్ణ చిటికలేసి మరీ చెప్పిండు. తెలంగాణలో నేనుంట అన్నాడు. రాష్ట్రం మొత్తం తిరుగుతా అన్నడు. తడాఖా చూపిస్త అన్నాడు.. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. ఇక లోకేశ్ చిన్న పిల్లవాడో, పెద్దవాడో అర్థం కాని పరిస్థితి. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండడు. సూర్యచంద్రులకు కూడా దొరకడు. కలుద్దామని 20 సార్లు ఫోన్ చేశాను. కాని కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య పార్టీలో ఎందుకు ఉండాలో అర్థం కాలేదు. అందుకే రాజీనామా చేశాను’’ అని చెప్పుకొచ్చాడు.
అంతేకాక ‘‘నేను పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నేనే పార్టీకి డబ్బులు ఇచ్చిన. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడికి నెలకు రూ.50వేలు ఇస్తున్నాను. నేను పార్టీలోకి వచ్చిన కొత్తలో రూ.11 లక్షలు రామ్మోహన్ రావుకు ఇచ్చాను. అందులో పార్లమెంటు అధ్యక్షులకు రూ. 50 వేల చొప్పున, మిగతా అటెండర్ల కోసం ఇవ్వమని చెప్పాను. కానీ రూ.లక్ష మాత్రమే అటెండర్లకు ఇచ్చినారు. మిగతా 10 లక్షలకు ఇప్పటి వరకు లెక్కలేదు’’ అని ఆరోపించారు.
అంతేకాక తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు పడిన కష్టమంతా గంగలో పోసిన పన్నీరుగా మారిందని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపలేదని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా బాబు, లోకేశ్‌ని సంప్రదించినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఈ శాసనసభ ఎన్నికల్లో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పోటీ చేయాలనుకునే 67 మంది అభ్యర్థులను ఆయా నియోజకవర్గాల కోసం ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చారు కాసాని. ఎన్నికల కోసం ఐదేళ్లుగా ఎదురు చూసిన పార్టీ నేతలకు అన్యాయం జరిగిందన్నారు. ‘‘చంద్రబాబును శుక్రవారం రాజమహేంద్రవరం జైల్లో కలిసి టీటీడీపీ తరపున పోటీ చేసే అంశం గురించి మాట్లాడితే ‘మనం పోటీ చేయడం లేదు’ అని చెప్పారు. ఈ నిర్ణయం గురించి విన్న తర్వాత తనకేం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దంటే పార్టీ ఎందుకని’’ ప్రశ్నించారు కాసాని.
ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఓ లెక్క.. జనరల్ ఎన్నికల్లో కూడా చేయకపోతే ఎలా అని కాసాని ప్రశ్నించారు. అంతేకాక ఆంధ్రాలో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేస్తుంది.. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీతో పొద్దు వద్దంటున్నారు. ఇదేం పద్ధతి. అక్కడ ఒకలా.. ఇక్కడ మరొకలా ఎలా అని ప్రశ్నించారు. అంతేకాక త్వరలోనే కాసాని కారు ఎక్కనున్నారనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు.