Dharani
Kavitha Comments After Release From Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత కల్వకుంట్ల చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి. ఆ వివరాలు..
Kavitha Comments After Release From Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత కల్వకుంట్ల చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి. ఆ వివరాలు..
Dharani
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఐదు నెలల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో ఆమెను అరెస్ట్ చేయగా.. ఆగస్టు 27 వరకు ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఐదున్నర నెలల తర్వాత ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను రిసీవ్ చేసుకునేందుకు.. కుటుంబ సభ్యులు.. తీహార్ జైలు వద్దకు వెళ్లారు. వారితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. జైలు నుంచి బయటకు వస్తూ.. పిడికిలి బిగించి.. తన కోసం వచ్చిన వారికి అభివాదం తెలిపారు కవిత.
సుమారు ఐదున్నర నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. మొదట తన కుమారున్ని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత భర్తను కూడా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అనతరం.. అన్నను మిగతా నేతలను కలిశారు. ఆ తర్వాత కవిత మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు పంపి తనను జగ మొండిదాన్ని చేశారని చెప్పుకొచ్చారు.
‘‘ఐదున్నర నెలల తర్వాత మళ్లీ మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 18 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. నన్ను అనవసరంగా జైలులో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు వాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. ఐదున్నర నెలల పాటు ఓ తల్లిగా పిల్లలకు, కుటుంబానికి దూరంగా ఉండటం ఎంతో ఇబ్బందికర విషయం. ముందే నేను మొండిదాన్ని. అనవసరంగా ఇప్పుడు నన్ను జగమొండిగా మార్చారు. నన్ను అన్యాయంగా జైలులో పెట్టినవాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాం.. ఆ సమయం త్వరలోనే వస్తుంది’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇక ఇటువంటి కష్ట సమయంలో నాకు, నా కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, నేను మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపించి నన్ను జగమొండిగా మార్చారు. మేము ఫైటర్స్. న్యాయంగా పోరాడతాం. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పోరాడతాం’’ అని చెప్పుకొచ్చారు.
#WATCH | Delhi: BRS leader K Kavitha says “I want to thank all of you. I became emotional after meeting my son, brother and husband today after almost 5 months. Only politics is responsible for this situation. The country knows that I was put in jail only because of politics, I… pic.twitter.com/VVbunxb9qk
— ANI (@ANI) August 27, 2024