Tirupathi Rao
Jr NTR Fans Angry On Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం బాలకృష్మ- టీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ల చూపు వైసీపీ వైపు మళ్లుతోందా?
Jr NTR Fans Angry On Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం బాలకృష్మ- టీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ల చూపు వైసీపీ వైపు మళ్లుతోందా?
Tirupathi Rao
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార వైసీపీ వై నాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ పరిస్థితి మాత్రం ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. ఇప్పటికే పార్టీ నుంచి సీనియర్ నేతలు వీడుతున్న సమయంలో వారికి ఈ వార్త పెద్ద షాక్ అనే చెప్పాలి. విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు టీడీపీకి మద్దతుగా నిలవకపోగా.. వైసీపీ వైపు మళ్లుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. టీడీపీ అధినేతకు ఇది మింగుడు పడని వార్తనే చెప్పాలి. అయితే అసలు అలా ఎందుకు జరిగింది? అందుకు గల కారణాలు ఏంటే చూద్దాం.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల్లో కొత్త టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తోంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు అనే సంకేతాలు వస్తున్నాయి. తాజా పరిణామాలు, సోషల్ మీడియా ప్రచారాలు చూస్తే అది నిజమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇద్దరూ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వారిని కావాలనే దూరం పెడుతున్నారనే అభిప్రాయాలు, విమర్శలు కూడా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో తారక్- కల్యాణ్ రామ్ ఇద్దరూ స్పందించకపోవడాన్ని పెద్దఎత్తున రాజకీయం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ సమయంలో బాలకృష్ణను వాళ్లు స్పందిచకపోవడాన్ని ఎలా చూస్తారు అని అడిగితే.. సినిమా స్టైల్ లో “బ్రో ఐ డోంట్ కేర్” అంటూ డైలాగ్ చెప్పారు.
ఆ సందర్భంలోనే బాలయ్య ప్రవర్తన చూసిన తర్వాత.. తారక్ ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్దంతి సందర్భంగా అలాంటి సీన్ ఒక రిపీట్ అయ్యింది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కావాలని తొలగించారు. అందుకు బాలయ్య ఆదేశాలు ఇస్తున్నట్లు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే తీసేయండి అంటూ ఆదేశాలు జారీ చేసి కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తుల యుద్ధప్రాతిపదికన తారక్ ఫ్లెక్సీలను తొలగించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా.. తారక్ అభిమానులు వైసీపీ వైపు మళ్లేలా ఈ చర్యలు దోహదపడ్డాయి అంటున్నారు. తారక్- కల్యాణ్ రామ్ మీద బాలయ్యకు ఎందుకు అంత అక్కసు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఇప్పటికే తారక్ అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్త పరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు తారక్ నుంచి గానీ, కల్యాణ్ రామ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక నిర్ణయం, ప్రకటన అయితే రాలేదు. పొలిటికల్ గా వాళ్లు స్టాండ్ తీసుకోలేదు, తమ అభిమానులకు నిర్ణయాన్ని కూడా చెప్పలేదు. కానీ, స్వచ్ఛందంగా అభిమానులే వైసీపీకి మద్దతుదారులుగా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు తారక్ సోదరలుపై బాలయ్య చూపిస్తున్న అక్కసే కారణంగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. తారక్ ఫ్లెక్సీలు తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.