చంద్రబాబుకి IT శాఖ షాక్‌.. ఇక జైల్లోనే విచారించేందుకు రెడీ?

స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట అయిన చంద్రబాబుకి.. ఐటీ శాఖ షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మరి ఇంతకు ఏం జరిగింది అంటే..

స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట అయిన చంద్రబాబుకి.. ఐటీ శాఖ షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మరి ఇంతకు ఏం జరిగింది అంటే..

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో కూడా చంద్రబాబు ఏ1గా తేలాడు. ఇక ఇప్పటికే స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఒక కేసు నుంచి బయటపడ్డ.. మరో కేసులో అరెస్ట్‌ చేసేందుకు విచారణ సంస్థలు రెడీగా ఉన్నాయి. వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఐటీ శాఖ అధికారులు కూడా చంద్రబాబుకు షాక్‌ ఇవ్వడానికి రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

చంద్రబాబు ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఐటీ శాఖ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు తీసుకున్నాడని ఐటీ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి విచారణకు హాజరుకావాల్సిందిగా ఐటీ శాఖ ఇప్పటికే ఐదు సార్లు నోటీసులు జారీ చేసింది. అయినా సరే చంద్రబాబు విచారణకు హాజరు కాలేదు. దాంతో త్వరలోనే మరోసారి నోటీసు జారీ చేయాలని డిసైడ్ అయ్యిందట.

అంతేకాక ప్రస్తుతం చంద్రబాబు.. స్కిల్ స్కామ్‌ కేసులో అరెస్టయి జైలులోనే ఉన్నారు. కాబట్టి ఐటీ శాఖ మరోసారి నోటీసులిచ్చి.. జైలులోనే విచారించేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇందుకు అవసరమైన లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతోందని సమాచారం. సబ్ కాంట్రాక్టర్ మనోజ్ వాసుదేవ్‌ని ఐటి శాఖ విచారించినపుడు చంద్రబాబుకు ముడుపులు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.

తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూ.118 కోట్ల ముడుపులను అందుకున్నట్లు మనోజ్ ఐటి శాఖ విచారణలో అంగీకరించారని అధికారులు వెల్లడించారు. దీని ఆధారంగా ఐటి శాఖ చంద్రబాబును విచారించాలంటే అందుకు ఆయన సహకరించటంలేదు. ఇక ఈసారి కూడా చంద్రబాబు నోటీసులపై స్పందింకపోతే.. ఆయనను జైల్లోనే విచారించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

Show comments