Dharani
వైసీపీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. నెల రోజుల్లోనే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో మరో నలుగురు నేతలు కూడా ఆయన బాటలోనే పయనించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆ వివరాలు..
వైసీపీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. నెల రోజుల్లోనే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో మరో నలుగురు నేతలు కూడా ఆయన బాటలోనే పయనించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆ వివరాలు..
Dharani
ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సరిగా నెల రోజుల క్రితం వైసీపీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. పదేళ్ల పాటు వైసీపీలో కొనసాగిన ఆర్కే.. కాంగ్రెస్ పార్టీలో చేరి నెల రోజులు కూడా ఉండలేకపోయారు. హస్తం పార్టీలో చేరి సరిగ్గా నెల రోజులు గడిచాయో లేదో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, షర్మిల స్వార్థం వంటి వాటిని దగ్గర నుంచి చూసిన ఆర్కే.. అక్కడ ఇమడలేక వైసీపీలోకి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరో నలుగురు నేతలు కూడా ఆర్కే బాటలోనే పయనించేందుకు రెడీ అవుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఆర్కే కన్నా ముందు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు వైసీపీని వీడి.. టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీలో వారికి కనీస గౌరవం దక్కడం లేదన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు తత్వం తెలిసి కూడా ఆయన పార్టీలో చేరిన ఈ నేతలు.. ఇప్పుడు బాధపడుతున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు.
వీరు పార్టీలో చేరినప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన గౌరవం ఇప్పుడు కనిపించడం లేదని.. అంతేకాక తమకు టికెట్ ఇచ్చే అంశంలో కూడా ఇంకా ఎటు తేల్చకుండా చంద్రబాబు అవమానిస్తున్నారని భావిస్తున్నారట. ఆనం రామనారాయనరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలకు చంద్రబాబు ఊహించని ఝలక్ ఇచ్చాడు. వారు కోరుకున్న.. వారికి పట్టున్న స్థానాల్లో కాకుండా.. ఇతర చోట పోటీ చేయమని ఒత్తిడి చేస్తున్నారట.
కొందరికి అసలు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ముందు పార్టీ గెలుపు కోసం పని చేయమని.. అధికారంలోకి వచ్చాక వారి గురించి ఆలోచిస్తామని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారట. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని.. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదని తెలుస్తోంది.
బాబు వైఖరితో ఈ నలుగురు నేతలు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది అంటున్నారు రాజకీయ పండితులు. తాము పార్టీ మారకుండా వైసీపీలోనే ఉంటే.. గౌరవమర్యాదలతో పాటు.. మళ్లీ టికెట్ కూడా వచ్చేదని.. కానీ ఇప్పుడు టీడీపీలో తమకు పట్టించుకునే నాథుడే లేడని ఈ నేతలు తమ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దాంతో త్వరలోనే ఈ నలుగురు నేతలు కూడా ఆర్కే బాటలో టీడీపీని వీడి.. తిరిగి వైసీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది.