iDreamPost
android-app
ios-app

పవన్ కల్యాణ్ కు మంత్రి మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలు!

పవన్ కల్యాణ్ కు మంత్రి మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలు!

ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థం లేనివంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కు చంద్రబాబు పొలిటికల్ ప్రొడ్యూసర్ అంటూ ఎద్దేవా చేశారు. ఓ విధానం, సిద్ధాంతం, స్థిరత్వం లేకుండా పవన్ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఒకవైపు బీజేపీతో సంసారం చేస్తూ.. మరోవైపు టీడీపీతో సహజీవనం చేస్తున్నారంటూ చెపపుకొచ్చారు.

“చంద్రబాబు ఏం చెబితే దానికి పవన్ వత్తాసు పలుకుతారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆరేడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడైనా ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారో చెప్పారా? చంద్రబాబు రాసిచ్చిందే పవన్  చదువుతున్నారు. జగన్ ని విమర్శించడమే ఏకైక టార్గెడ్ గా పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే నాయకుడు అయిపోతానని భావిస్తున్నాడు. పవన్ కల్యాణ్ ని చూస్తుంటే జాలేస్తోంది. పవన్ కల్యాణ్ చేసే వ్యాఖ్యలు అన్నీ అర్థంలేకుండా ఉంటాయి” అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు పవన్ కల్యాణ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంపై చేసిన ఆరోపణలను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. పవన్ కల్యాణ్ కు అమర్నాథ్ సలహా ఇచ్చారు. “ఆంధ్ర యూనివర్సిటీ వ్యాలు పడిపోయింది అని చెబుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఒక డిపార్టుమెంట్ చెప్పమనండి. అందులో ఒక సెమిస్టర్ పాస్ కామని చెప్పండి. ఇంటర్ పాస్ కాలేదు అంటాడు. 2 లక్షల పుస్తకాలు చదివాను అని చెబుతాడు. మళ్లీ ఆంధ్ర యూనివర్సిటీ గురించి మాట్లాడేస్తుంటాడు. ఏయూ ర్యాకింగ్స్ 29 నుంచి 76వ స్థానానికి వచ్చింది. రూ.110 కోట్లతో ముఖ్యమంత్రి కొత్త భవనాలు ప్రారంభించిన విషయం తెలిసిందే కదా. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలా? నా ఉద్ధేశంలో ఒక రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత కొన్ని విధానాలు, సిద్ధాంతాలు ఉండాలి. కథానాయకుడికి.. ప్రజానాయకుడికి తేడా ఉంటుంది. పవన్ కల్యాణ్ కథానాయకుడు అయితే.. జగన్ ప్రజానాయకుడు” అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.