iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! కొత్తగా..

  • Author Soma Sekhar Published - 07:21 PM, Wed - 5 July 23
  • Author Soma Sekhar Published - 07:21 PM, Wed - 5 July 23
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! కొత్తగా..

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థుల కలను ప్రభుత్వం నెరవేరుస్తోంది. అందుకు తగ్గట్లుగానే మెడికల్ కాలేజీలను స్థాపిస్తూ.. వైద్య రంగాన్ని పటిష్టం చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో.. సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఉండాలని పట్టుబట్టారు. ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో 8 కోత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణకు మరో 8 కొత్త మెడికల్ కళాశాలలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు ఇస్తూ.. ఉత్తర్వులను జారీ చేసింది. దాంతో దేశంలోనే తెలంగాణ అరుదైన ఘనతకు చేరువైంది. ఇక ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఉండాలన్న కేసీఆర్ లక్ష్యం నెరవేరబోతోంది. గత 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో 29 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. తాజాగా 8 కొత్త కాలేజీలు మంజూరు కావడంతో.. రాష్ట్రంలో MBBS సీట్లు 10 వేలకు పెరగనున్నాయి. ఈ కాలేజీలు జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, వరంగల్, ములుగు, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కాలేజీల ఏర్పాటుకు అనుమతులు లభించాయి.

కాగా.. మెడికల్ కాలేజీల మంజూరు పై వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావ్.. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వైద్య విప్లవంతో.. మారుమూల ప్రాంతాలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని, అలాగే స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరుగుతాయని ఈ సందర్భంగా హరీష్ రావ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. గత నెల ప్రారంభంలో దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఏపీకి 5, తెలంగాణకు 12 వైద్య కళాశాలలను కేటాయించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఈ మెడికల్ కాలేజిల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.