Dharani
నిజం గెలవాలంటూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చేస్తోన్న అసత్య ప్రచారాన్ని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ.. విమర్శలు చేస్తోన్నారు. ఆ వివరాలు..
నిజం గెలవాలంటూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చేస్తోన్న అసత్య ప్రచారాన్ని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ.. విమర్శలు చేస్తోన్నారు. ఆ వివరాలు..
Dharani
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వందల కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడటంతో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి జనాల్లోకి వచ్చి.. బాబు అరెస్ట్ మీద సింపతీ క్రియేట్ చేద్దామని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఏం లాభం వారి ప్రయత్నాలకు ఎక్కడికక్కడ బ్రేక్ పడుతోంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేతలు చేస్తోన్న ఓ అసత్య ప్రచారానికి సంబంధించి అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అబద్ధాలను ప్రచారం చేయడంలో చంద్రబాబే టాప్‌లో ఉంటాడు అనుకుంటే ఆయన భార్య కూడా బాబుకి ఏమాత్రం తగ్గడం లేదు కదా అంటున్నారు జనాలు. ఇంతకు ఏం జరిగింది అంటే..
అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మంది మరణించారని టీడీపీ ప్రచారం చేస్తోంది. అంతేకాక ప్రస్తుతం నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేస్తూ.. బాబు కోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఆవులపల్లి ప్రవీణ్ రెడ్డి(33) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
ఇక్కడ ఆశ్చర్య కలిగించే అంశం ఏంటంటే.. ప్రవీణ్ రెడ్డి రెండు నెలల క్రితం టీడీపీలో చేరాడు. అంతకముందు నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీకి పనిచేశాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం ప్రవీణ్ రెడ్డికి ఇంట్లో గుండెపోటు రావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ప్రవీణ్ మృతిని బాబు ఖాతాలో వేసేశారు.
అలానే పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు(70) కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించారు. గత నెల 25న చిన్నబ్బ నాయుడు వృద్ధాప్య సమస్యలతో మృతి చెందాడు. అయితే చంద్రబాబుని అరెస్టు చేసినందుకు మనస్తాపంతో మృతి చెందినట్లు టీడీపీ నేతలు ప్రచారానికి దిగారు. ఇక పచ్చ నేతలు చేస్తోన అసత్య ప్రచారం చూసి జనాలు విస్మయానికి గురవుతున్నారు. మరీ ఇంత దిగజారుడు చర్యలకు పాల్పడటం అవసరమా.. బాబే అనుకుంటే ఆయన భార్య కూడా అబద్ధాలు ప్రచారం చేయడంలో బాగానే ఆరితేరారు కదా అని నవ్వుకుంటున్నారు.
భువనేశ్వరి బుధవారం మృతుల కుటుంబాలకు పంపిణీ చేసిన చెక్కులు కూడా గందరగోళానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సంతకం చేసిన చెక్కులను మృతుల కుటుంబాలకు పంపిణీ చేశారు. భువనేశ్వరి తన పరామర్శ యాత్రలో ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ నాయుడు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించారు. వీరంతా అక్టోబర్‌లో మరణిస్తే.. చెక్కుల మీద మాత్రం సెస్టెంబర్‌లోనే సంతకం చేసినట్లు ఉంది. చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ కాగా, ఆ చెక్‌లు చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సెప్టెంబర్ 4న సంతకం చేసినవి కావడం గమనార్హం. ఇక టీడీపీ నేతలు చేస్తోన్న అసత్య ప్రచారంపై జనాలు విమర్శలు చేస్తున్నారు.