Tirupathi Rao
Telangana Congress Government Rs.500 Gas Cylinder Scheme Rules: కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఒకటి. ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Telangana Congress Government Rs.500 Gas Cylinder Scheme Rules: కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఒకటి. ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Tirupathi Rao
తెలంగాణ ఎన్నికలు 2023లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవడం మాత్రమే కాకుండా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని కాదని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వినిపిస్తోంది.. కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించే. తాము అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తాం.. ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. ఆ గ్యారెంటీలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి అనడంలో సందేహం లేదు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మహాలక్ష్మి పథకంలో మహిళల కోసం ప్రతి నెలా రూ.2,500 పింఛను, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కేవలం రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలు ఉన్నాయి. వీటిలో అందరూ ఇప్పుడు ఎదురుచూస్తోంది రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కోసమే. ఎందుకంటే వంటగ్యాస్ అనేది ఇప్పుడు అందరికీ భారంగా మారిపోయింది. గ్యాస్ సిలిండర్ కోసం రూ.వెయ్యి నుంచి రూ.1100 ఖర్చు చేయడం మధ్యతరగతి ప్రజలకు అదనపు భారంగానే ఉంటోంది. పేరుకి సబ్సిడీ ఉన్నా కూడా అది ఎప్పుడు పడుతోంది? ఎవరి ఖాతాల్లో పడుతోందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. అందుకే కాంగ్రెస్ పార్టీ కేవలం రూ.500 గ్యాస్ సిలిండర్ అనగానే ప్రజల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఈ గ్యాస్ సిలిండర్ హామీ కూడా కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. అందుకే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనే ఆసక్తి ప్రజల్లో మొదలైంది.
రాష్ట్రంలో మొత్తం 1.28 కోట్లకు పైగా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు వెరసి 2 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో గ్యాస్ 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.955గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిచడం ప్రారంభిస్తే.. సిలిండర్ ధరలో మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి ఈ గ్యాస్ సిలిండర్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2,923.65 కోట్ల భారాన్ని సబ్సిడీ కింద భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పుడల్లా ప్రభుత్వంపై భారం కూడా పెరుగుతూ ఉంటుంది.
ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని వచ్చే ఏడాది నుంచే అమలులోకి తీసుకొస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పథకం అమలు గురించి మాత్రమే కాకుండా.. ఎవరికి వర్తింపజేస్తారు అనే ప్రశ్న కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి పథకాలను బిలో పావర్టీ లైన్, తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే అమలు చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఆ వర్గాల వరాకి కచ్చితంగా అందుతుంది. తెల్లరేషన్ కార్డుదారులకు, బిలో పావర్టీ లైన్ వారికి కచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇంకా ఈ పథకానికి సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయి. మధ్యతరగతి, అంతకన్నా పై వర్గాల వారికి ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తారా? అనే ప్రశ్న వినిపిస్తోంది.
అంతేకాకుండా స్థానికులు, స్థానికేతరులు అనే అంశం కూడా తెరమీదకు వస్తోంది. పక్కరాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి కూడా ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయాలపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మార్గదర్శకాలు విడుదలైన తర్వాత మాత్రమే ఈ ప్రశ్నలపై క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది. సాధ్యమైనంత వరకు గ్యాస్ కనెక్షన్ ఉన్న అందరికీ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రకటించే వరకు స్పష్టత రావడం కష్టం. మరి.. కాంగ్రెస్ పార్టీ అందించబోతున్న ఈ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.