iDreamPost
android-app
ios-app

పవన్ ఆస్తుల అమ్మకాల్లో లాజిక్ ఎక్కడ? ఉత్త ప్రచారమా..

Pawan Kalyan Selling Assets: పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తి డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ కోసం కొత్త కొత్త స్ట్రాటజీలు ప్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

Pawan Kalyan Selling Assets: పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తి డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ కోసం కొత్త కొత్త స్ట్రాటజీలు ప్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

పవన్ ఆస్తుల అమ్మకాల్లో లాజిక్ ఎక్కడ? ఉత్త ప్రచారమా..

ఏపీ రాజకీయాలు రానురాను ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే.. టీడీపీ- జనసేన కూటమి మాత్రం అభ్యర్థుల ఎంపిక, బుజ్జగింపుల పర్వాలతోనే కాలం వెళ్లదీస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి అయితే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిపోయింది. పొత్తులో భాగంగా ఎంతలేదన్నా.. 50 సీట్లు దక్కించుకుంటాడని, సీఎం సీటు షేర్ వస్తుందని ఆశపడిన జనసేన కార్యకర్తలు- నాయకులకు భంగపాటు తప్పలేదు. కేవలం 24 సీట్లకు జనసేనాని పరిమితం కావడం సొంత పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఈ నిరసన సెగలను చల్లార్చేందుకు పవన్ కల్యాణ్ కొత్త సింపథీ గేమ్ స్టార్ట్ చేసినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పొత్తులో భాగంగా గౌరవప్రదమైన సంఖ్య దక్కించుకుటాడని భావించిన జనసేన నేతలు- కార్యకర్తలు విస్తుపోయేలా జనసేనాని కేవలం 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలతో సరిపెట్టుకున్నారు. అది కూడా కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. అందులో పవన్ కల్యాణ్ పేరు కూడా లేదు. ఇన్ని ట్విస్టులు చూసిన తర్వాత సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు అందరూ నిరసనలకు దిగారు. సోషల్ మీడియాలో కూడా పెద్దఎత్తున క్యాంపైన్లు స్టార్ట్ చేశారు. నమ్ముకున్న నాయకుడు మోసం చేశాడు అంటూ.. మేమింక మీతో నడవలేమి బాహాటంగానే ప్రకటించేస్తున్నారు.

ఈ డ్యామేజీ కంట్రోల్ చేయడానికి పవన్ కల్యాణ్ కొత్త స్ట్రాటజీ అప్లయ్ చేశాడు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు ఇందతా ఎందుకు జరుగుతోంది అంటే.. హైదరాబాద్ లో తనకున్న స్థలాన్ని పవన్ కల్యాణ్ ఎన్నికల కోసం అమ్మేశాకు అని వార్తలు వచ్చాయి. మరో రెండు ప్రాపర్టీలను కూడా అమ్మకాని పెట్టారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అభిమానులను ఎమోషనల్ గా టార్గెట్ చేయడం కోసమే చేశారు అంటూ చెబుతున్నారు. ఎందుకంటే.. 2019లో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశారు. అప్పుడే ఎన్నికల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాలేదు. కానీ, ఇప్పుడు పోటీ చేస్తున్న 24 సీట్ల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు. అభిమానులు, ఎన్నారైలు నిధులు సమకూరుస్తూనే ఉన్నారు.

పార్టీ సభ్యత్వాల పేరిట కూడా నిధులు సమకూరుతున్నాయి. పైగా ఇప్పుడు పొత్తులో వెళ్తున్నారు. కాబట్టి టీడీపీ తరఫున కూడా ఫండింగ్ ఉంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఒంటరిగా పోటీ చేసినప్పుడే మీకు ఎలాంటి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రానప్పుడు.. పొత్తులో కేవలం 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎందుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆస్తుల అమ్మకాల్లో ఎందుకో లాజిక్ మిస్ అవుతోంది అని అటు రాజకీయ విశ్లేషకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్న సిపంథీ స్టంట్ అని కూడా అభిప్రాయపడుతున్నారు. మరి.. పవన్ ఆస్తులు అమ్మకంలో లాజిక్ ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.