Minister Seethakka: తెలంగాణలో మహిళల కోసం కీలక నిర్ణయం! రంగంలోకి మంత్రి సీతక్క!

తెలంగాణలో మహిళల కోసం కీలక నిర్ణయం! రంగంలోకి మంత్రి సీతక్క!

Minister Seethakka: ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Minister Seethakka: ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదై మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలతో పాటు ఇటీవల రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ లాంటి పథకాలు అమలు చేశారు. ఇక మహిళల, రైతు సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా భద్రత కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వస్తున్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. మహిళలు పట్టపగలు ఒంటరిగా నడవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, మహిళా భద్రతా విభాగం డీజీ షిఖా గోయల్, డీఐజీ రేమా రాజేశ్వరితో స్పెషల్ డ్రైవ్ విధి విధానాలపై చర్చించారు. మహిళల భద్రత కోసం స్వల్పకాలిక ప్రణాళికతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఇటీవల సొంత ఇంటి నుంచి, దగ్గరి మనుషుల నుంచి సైతం మహిళలకు రక్షణ లేకుండా పోతుందని మంత్రి సీతక్క అన్నారు. తమకు అన్యాయం జరిగితే బహిరంగంగా మాట్లాడే ధైర్యం మహిళల్లో కల్పించాలని అన్నారు. ఇందుకోసం విద్యా సంస్థలు, ఇతర సంస్థల్లో అవగాహన క్యాంపేయిన్ లు చేపడుతామని అన్నారు. మహిళా సంఘాల్లో 63 లక్షల మంది ఉన్నారని.. సంఘ సభ్యులతో గ్రామ స్థాయి నుంచి సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళలను వేధించకుండా పురుషులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అన్నారు. మహిళలను గౌరవించడం, నేరాలు జరిగినపుడు పడే శిక్షలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని.. దీనికోసం పాఠ్యాంశాల్లోనూ వీటిని చేర్చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క.

Show comments