P Krishna
CM Revanth Reddy Important Orders to Officials: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఈ క్రమంలోన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Reddy Important Orders to Officials: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఈ క్రమంలోన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
P Krishna
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రెండు రోజులుగా ఎవతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్డు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరదల కారణంగా పలు జిల్లాల్లో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో కుండపోత వర్షం కురుస్తుంది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలల్లో అలర్ట్ గా ఉంటూ ఎప్పకప్పుడు ప్రజలకు అవసరమైన సూచనలు, సహాయం చేయాలని సూచించారు. అవసరమైతే బాధితులను ఇంతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడితే ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అధికారులతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వారికి అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది. మరోవైపు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.