Arjun Suravaram
HYDRA Notices To CM Revanth Reddy Brother: తన ఇంటికి హైడ్రా ఇచ్చిన నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి వివరణ ఇచ్చారు. గురువారం ఉదయం సీఎం సోదరుడి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించిన సంగతి తెలిసింది.
HYDRA Notices To CM Revanth Reddy Brother: తన ఇంటికి హైడ్రా ఇచ్చిన నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి వివరణ ఇచ్చారు. గురువారం ఉదయం సీఎం సోదరుడి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించిన సంగతి తెలిసింది.
Arjun Suravaram
హైదరాబాద్ లో హైడ్రా దూసుకెళ్తోంది. నగరంలోని చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలు తొలగిస్తూ ముందుకెళ్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఎవరైనా సరే ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. అందరూ సమానమే అని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా నిరూపించుకుంది. ఇలా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ..హైడ్రా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదే సమయంలో తాజాగా మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు జారీ చేసి. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు స్పందించారు.
మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉంది. ఆ ఇళ్లు దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి, గురువారం ఆయన ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు అధికారులు. ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు స్పందిస్తూ… తాను ఆ ఇంటిని 2015లో కొనుగోలు చేశానని తెలిపారు. అయితే ఆ ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదని ఆయన తెలిపారు. అంతేకాక తాను నివాసం ఉంటున్న గృహం ఎఫ్టీఎల్ కిందకు వస్తే..రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదని సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి తెలిపారు.
చెరువులు, జలశయాలు, అటవీ స్థలాలను రక్షణ కోసం హైడ్రా చేపడుతున్న ఈ చర్యల్లో భాగంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే తిరుపతి రెడ్డి ఇంటి అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తిరుపతి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక తాజాగా సీఎం సోదరుడు తిరపతి రెడ్డి ఇచ్చిన వివరణ తరువాత ఆయన ఇంటిని కూల్చేందుకు హైడ్రా అధికారులు సిద్ధం కావొచ్చనే ప్రచారం వినిపిస్తోంది. ఏది ఏమైనా తనకు హైడ్రా ఇచ్చిన నోటిసులపై తిరుపతి రెడ్డి ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.