iDreamPost
android-app
ios-app

CM Jagan: తెలంగాణలో జనసేన ఓటమిపై సీఎం జగన్ పంచ్ లు!

  • Published Dec 14, 2023 | 3:22 PM Updated Updated Dec 14, 2023 | 3:22 PM

ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ మీద పంచులు వేశారు. ఆ వివరాలు..

ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ మీద పంచులు వేశారు. ఆ వివరాలు..

  • Published Dec 14, 2023 | 3:22 PMUpdated Dec 14, 2023 | 3:22 PM
CM Jagan: తెలంగాణలో జనసేన ఓటమిపై సీఎం జగన్ పంచ్ లు!

ఉద్దానం పేరు చెప్పగానే.. కిడ్నీ బాధితులు గుర్తుకు వస్తారు. పాదయాత్ర సందర్భంగా తాను ఉద్దానం ప్రజల బాధను చూశానని, వాటిని తీరుస్తానని నాడు ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని ఇప్పుడు నెరవేర్చానని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సమస్య పరిష్కారం కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్లతో నిర్మించిన డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని గురువారం నాడు ఆయన ప్రారంభించారు. ఇక్కడ 42 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 60 మంది స్టాఫ్ నర్సులు, 60 మంది సహాయక సిబ్బంది, 200 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మీద పంచులు వేశారు. ఆ వివరాలు..

జగన్ మాట్లాడుతూ.. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని గుర్తు చేశారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని.. ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా నీరు అందించలేదని తెలిపారు. సొంత నియోజవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు.. ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందని ప్రశ్నించారు.ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారని ఈ సందర్భంగా జగన్ ఎద్దేవా చేశారు.

తెలంగాణలో చంద్రబాబు తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. పవన్ నాన్‌ లోకల్‌ ప్యాకేజీ స్టార్‌.. బాబు ఇంకో పార్ట్‌నర్‌ అన్నారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదన్నారు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు. నాన్‌ లోకల్స్‌ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాల్లో నిర్ణయిస్తామంటున్నారని ఈ సందర్భంగా సీఎం జగన్ ధ్వజమెత్తారు.

అంతేకాక “ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం. పాదయాత్ర సందర్భంగా ఇక్కడి ప్రజల బాధలు చూశాను.. వాటిని తీరుస్తానని హామీ ఇచ్చాను. ఆమాట ప్రకారమే ఇక్కడ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ తీసుకువచ్చాం. ఇందుకోసం దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. అలానే ఇక్కడి ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించడ కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని తెలిపారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ రీసెర్చ్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అ‍త్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు అందిస్తున్నాం అన్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం అని తెలిపారు. కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని 7 మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయించడమే కాక.. కిడ్నా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు సీఎం జగన్.

marsbahis giriş