Dharani
స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బాబుకి బెయిల్ రావడం వెనక జగన్ సర్కార్ నిజాయతీ ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమే అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకనేది కూడా వివరిస్తున్నారు. ఆ వివరాలు..
స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బాబుకి బెయిల్ రావడం వెనక జగన్ సర్కార్ నిజాయతీ ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమే అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకనేది కూడా వివరిస్తున్నారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్లు తేలడంతో.. ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. సుమారు 52 రోజుల పాటు జైల్లో ఉన్న బాబు.. మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో.. బయటకు వచ్చాడు. అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి పచ్చనేతలు, ఎల్లో మీడియా.. ఇది ప్రభుత్వ కుట్ర, కావాలనే కేసులో ఇరికించారని గగ్గోలు పెట్టాయి. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని చంద్రబాబుని అన్యాయంగా అవినీతి కేసులో ఇరికించారని ఆరోపించాయి. జగన్ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఇష్టారీతిగా విమర్శలు చేశాయి. ఆఖరికి బాబుకి బెయిల్ రాకపోవడానికి కూడా జగనే కారణం అన్నట్లు విమర్శించాయి. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు.
ఈ క్రమంలో అక్టోబర్ 31న బాబుకి మధ్యంతర బెయిల్ వచ్చింది. దాంతో జగన్ సర్కార్ వల్లే బాబుకి బెయిల్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై జర్నలిస్ట్ సాయి స్పందిస్తూ.. ‘‘అనారోగ్యం, కంటి సర్జరీ చేయించుకోవాల్సి ఉండటంతో.. ఏపీ హైకోర్టు చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసింది. అయితే బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద సీఐడీ తన వాదనలు వినిపిస్తూ.. బాబుకి సర్జరీ అంత అత్యవసరం ఏం కాదు అని మాత్రమే చెప్పింది. అలా కాకుండా.. మా జ్యూడిషియల్ పర్యవేక్షణలోనే చికిత్స చేయిస్తాము అని ఉంటే కోర్టు కూడా అందుకు అంగీకరించేది. అప్పుడు బాబు బెయిల్ పిటిషన్ విచారణ మరోలా ఉండేది’’ అని చెప్పుకొచ్చారు.
అంతేకాక ఇక్కడ బాబు అనారోగ్యం గురించి ప్రభుత్వ డాక్టర్ నిజాయతీగా నివేదిక ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వ పారదర్శకత స్పష్టంగా తెలుస్తోంది. ఇక డాక్టర్ కూడా బాధ్యతగా వ్యవహరించాడు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే.. డాక్టర్ ఇంత నిజాయతీగా వ్యవహరించి ఉండేవాడా అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాక ఈ కేసు విషయంలో మొదటి నుంచి జగన్ సర్కార్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది.. అందుకే అన్ని చట్ట ప్రకారం జరిగాయి తప్ప.. ఎక్కడా కక్ష్యాపూరితంగా వ్యవహరించలేదు అని అంటున్నారు. జగన్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది కనుకే.. బాబుకి బెయిల్ వచ్చింది అనే మాట నూటికి నూరు శాతం కరెక్ట్ అంటున్నారు రాజకీయ పండితులు.