iDreamPost
android-app
ios-app

మరోసారి పరువు పోగొట్టుకున్న బాబు! తీసి పారేసిన కేంద్రం!

  • Published Aug 19, 2023 | 1:31 PM Updated Updated Aug 19, 2023 | 1:31 PM
  • Published Aug 19, 2023 | 1:31 PMUpdated Aug 19, 2023 | 1:31 PM
మరోసారి పరువు పోగొట్టుకున్న బాబు! తీసి పారేసిన కేంద్రం!

చంద్రబాబు నాయుడు తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని గొప్పగా చెప్పుకుంటాడు. ఎక్స్‌పీరియన్స్‌ సంగతి ఏమో కానీ.. అధికారం కోసం ఆయన ఎవరినైనా మోసం చేయగలడని.. చూస్తోన్న జనాలకు, ఆయనతో పని చేసిన నేతలకు కూడా బాగా తెలుసు. తనకు అవసరం ఉంటే ఎంత మంచిగా ఉంటారో.. అది తీరాక ఎలా ప్రవర్తిస్తారో జనాలు చూస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు గెలుపు కోసం ఎవరితో అయినా కలిసిపోతారు.. ఆ తర్వాత.. వారిని ఎలా విమర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

2019 ఎన్నికల ముందు చంద్రబాబు.. మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేసుకుందాం. బీజేపీకి సహకరించేవారంతా దేశద్రోహులే.. మోదీ హటావో.. దేశాన్ని కాపాడుకోవడానికి అన్ని పక్షాలతో కలిశాం.. నాకు కొడుకు ఉన్నాడు.. మనవడు ఉన్నాడు.. నీకెవరు ఉన్నారంటూ చంద్రబాబు.. మోదీ గురించి ఎంత దిగజారి వ్యాఖ్యలు చేశారు ఎవ్వరు మర్చిపోలేరు. అమిత్‌ షా తిరుపతి పర్యటనకు వచ్చిన సమయంలో చంద్రబాబు ఎంత దారుణంగా ప్రవర్తించారో బీజేపీ నేతలు అంత త్వరగా మర్చిపోరు.. మర్చిపోలేరు.

2019 ఎన్నికలకు ముందు బీజేపీని ఇలా ముప్పలు తిప్పలు పెట్టిన చంద్రబాబు.. తాజాగా తన పంథా మార్చారు. కేంద్ర ప్రభుత్వంతో.. మరీ ముఖ్యంగా బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగించాలని తెగ ఉబలాటుపడుతున్నారు చంద్రబాబు. మోదీ ప్రపంచంలో గొప్ప నేత.. ఎన్డీఏలో చేరడానికి రెడీ అని సంకేతాలు పంపిస్తున్నారు. కారణం.. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేదు. పొత్తులు అవసరం. అందుకే కాషాయ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా తన మీద సానుభూతి పెంచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు.

కేంద్రానికి లేఖ..

ఈ క్రమంలోనే చంద్రబాబు.. అధికార వైసపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి 9 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు చంద్రబాబు. దీనితో పాటు 70 పేజీలకు పైగా డాక్యుమెంట్లు, వీడియోలను ఆధారాలుగానూ సమర్పించారు. బీజేపీతో తన బంధాలను మెరుగుపర్చుకోవడం కోసం చంద్రబాబు అప్లై చేస్తోన్న సరికొత్త ట్రిక్‌ ఇది. ఒక వేళ కేంద్రం గనక.. ఈ లేఖపై స్పందించి.. చర్యలు తీసుకుంటే.. దీన్ని అవకాశంగా చేసుకుని.. బీజేపీతో తిరిగి దగ్గర అవుదామనుకున్నారు చంద్రబాబు.

లైట్‌ తీసుకున్న కేంద్రం..

ఎన్నో ఆశలతో కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసి.. రిజల్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కేంద్రం గనక ఈ లేఖపై పాజిటీవ్‌గా స్పందిస్తే.. బీజేపీతో పొత్తులపై ముందుకు వెళ్దామని భావించారు చంద్రబాబు. మరి కేంద్రం ఏం చేసింది. ఏముంది.. బాబు వైఖరి తెలుసు కదా.. అందుకే లేఖను లైట్‌ తీసుకుంది. పది రోజులైనా చంద్రబాబు లేఖపై స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు నిజస్వరూపం ఏంటో స్వయంగా చూసిన తర్వాత.. మళ్లీ ఎవరు ఆయనతో దోస్తికి ముందుకు రారు అనే టాక్‌ ఉంది. కేంద్రం కూడా అదే ఫాలో అవుతుంది. అందుకే చంద్రబాబు లేఖ రాసి ఇన్ని రోజులైనా రెస్పాన్స్‌ లేదు. ఈ విషయం తెలిసి.. మరోసారి కేంద్రం ముందు సాగిలపడి.. తన పరువు తీసుకున్నారు చంద్రబాబు అంటూ జనాలు ఎద్దేవా చేస్తున్నారు.