iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు బీజేపీలో చేరిన క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్

ఎట్టకేలకు బీజేపీలో చేరిన క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర బీజేపీ నాయకులు జరిపిన చర్చలతో చీకోటికి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే బర్కత్ పురాలోని బీజేపీ ఆఫీస్ లో ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీ కండువా కప్పి చీకోటి ప్రవీణ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో రాజకీయాల్లోకి రావాలన్న తన కల ఎట్టకేలకు నెరవేరింది. అయితే ఇది వరకే చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరాల్సి ఉండగా కొందరు కమలం పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ రోజు పార్టీలో చేరకుండా బ్రేకులు పడ్డాయి.

తెలుగు రాష్ట్రాల్లో చీకోటి ప్రవీణ్ వ్యవహారం ఓ సంచలనమే. పేరున్న రాజకీయ నేతల నుంచి సినీ రంగంలోని సెలబ్రిటీల వరకు పరిచయాలున్న చీకోటి క్యాసినోల నిర్వహణ, గ్యాంబ్లింగ్ క్లబ్ లు నిర్వహించడంతో ఫేమస్ అయిపోయాడు. ఈ క్రమంలో చీకోటి క్రిమినల్ ఆరోపణలతో ఈడీ విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా గతంలో చీకోటి బీజేపీలో చేరేందుకు ధూం ధాంగా తన అనుచరులతో కలిసి బీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో చీకోటి చేరికపట్ల సంతృప్తిగా లేని పలువురు బీజేపీ లీడర్లు ఆయన చేరికను అడ్డుకున్నారు.

ఆ తరువాత హస్తినలో చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరిక గురించి బండి సంజయ్, డీకే అరుణలతో సంప్రదింపులు జరిపాడు. ఢిల్లీ పెద్దలతో చీకోటి చేరికపై మాట్లాడిన బండి సంజయ్ వారు ఓకే చెప్పడంతో చీకోటి చేరికకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయంలో డీకే అరుణ బీజేపీ కండువా కప్పి చీకోటిని పార్టీలోకి ఆహ్వానించారు. మరి చీకోటికి బీజేపీ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.