Madhavi Latha: పోలింగ్‌ డే: హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు!

Madhavi Latha, Election 2024, Hyderabad: హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీ లతపై పోలింగ్‌ డే నాడే కేసు నమోదు అయింది. ఆ కేసు గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Madhavi Latha, Election 2024, Hyderabad: హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీ లతపై పోలింగ్‌ డే నాడే కేసు నమోదు అయింది. ఆ కేసు గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ నడుస్తోంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌కు, తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. చెదురుమదురు ఘటనలు మినహా.. పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచుర్యం పొందిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై తాజాగా కేసు నమోదైంది. మాధవీ లత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద నానా హంగామా చేశారు. ఓటు వేయాడానికి వచ్చిన వారి ముఖాలను చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో సైతం గొడవకు దిగారు. ముఖ్యంగా ముస్లీం మహిళలు వేసుకున్న బురఖా తీసి పలువురు ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమే తనిఖీ చేశారు. ఈ ఘటనతో ఆమె తీరుపై పలువురు ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలోనే ఆగ్రహం ‍వ్యక్తం చేశారు.

కాగా, మాధవీ లత మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడంతో ఆమెపై కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లిన మాధవీ లత ఓటరు కార్డులను పరిశీలించి.. పాత బస్తీలో పోలింగ్‌పై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్నారని, భారీగా దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని ఆరోపించారు. అజంపుర, గోషామహల్ లో పోలింగ్‌ సరిగా జరగడం లేదంటూ సీరియస్ అయ్యారు. దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. మరి పోలింగ్‌ కేంద్రాల్లో మాధవీ లత హడావిడి, అలాగే ఆమెపై కేసు నమోదు అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments