Dharani
జాతీయ పార్టీగా మారిన తర్వాత.. తొలిసారి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన గులాబీ పార్టీ అక్కడ సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో కారు పార్టీ విజయం సాధించింది. ఆ వివరాలు.
జాతీయ పార్టీగా మారిన తర్వాత.. తొలిసారి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన గులాబీ పార్టీ అక్కడ సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో కారు పార్టీ విజయం సాధించింది. ఆ వివరాలు.
Dharani
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. తన టార్గెట్‌ని రీచ్ అయిన తర్వాత రాజీకయ పార్టీగా రూపాంతరం చెందింది. 2014 నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. రాష్ట్రంలో సత్తా చాటిన కారు పార్టీ.. గతేడాది భారతీయ రాష్ట్ర సమితిగా మారి.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు కదుతుతోంది.
దీనిలో భాగంగా మహారాష్ట్రలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. పలువురు మహారాష్ట్ర నేతలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక కేసీఆర్ మహారాష్ట్రలో కూడా బహిరంగ సభలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలో వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. గులాబీ బాస్ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి అనిపిస్తోంది. ఆ వివరాలు..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్.. మరోవైపు మహారాష్ట్ర గడ్డ మీద కూడా సత్తా చాటింది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఏకంగా 20కిపైగా స్థానాలను కైవసం చేసుకుంది. విదర్భ, షోలాపూర్‌లోని 20కి పైగా గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అడ్డాలో బీఆర్ఎస్ సత్తా చాటడం.. ఆసక్తికరంగా మారింది. జాతీయ పార్టీగా మారిన తర్వాత బీఆర్‌ఎస్ మహారాష్ట్ర ఎన్నికల్లో చేయడం ఇదే తొలిసారే. పైగా మొదటి సారే ఇంత మంచి ఫలితాలు రావడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
టీఆర్‌ఎస్‌ను జాతీయ స్థాయి పార్టీగా మార్చిన తర్వాత గులాబీ బాస్ కేసీఆర్.. మహారాష్ట్ర మీద ఫోకస్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ సరిహద్దులో ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో భారీ ర్యాలీలలు తీసి.. సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్‌ను ఆదరిస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలను.. అక్కడ కూడా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
దాంతో బీఆర్‌ఎస్‌కు మరాఠా ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. భారీ ఎత్తున మరాఠా నేతలు.. గులాబీ తీర్థం పుచ్చుకోవటంతో.. బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. దీంతో.. పంచాయతీ ఎన్నికల్లో 20కిపైగా గ్రామాల్లో గులాబీ జెండా ఎగిరింది. ఇదే హవా కొనసాగితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటగల్గుతుంది అంటున్నారు బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు.