ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్ రెడ్డి ఇష్యూ.. KTR సంచనల వ్యాఖ్యలు!

తెలంగాణలో ప్రస్తుతం ఓ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అదే శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదం. ఈ ఇష్యూపై తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

తెలంగాణలో ప్రస్తుతం ఓ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అదే శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదం. ఈ ఇష్యూపై తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

తెలంగాణలో ప్రస్తుతం ఓ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అదే శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదం.  కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించింది. ఈ నియామకంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యే మధ్య వివాదం ముదిరింది. చివరకు మాజీ మంత్రి హారీశ్ రావుతో సహా  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాలకు దిగే వరకు వెళ్లింది. ఇక తాజాగా ఈ ఎమ్మెల్యే ఇద్దరి వివాదంపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

శనివారం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన  కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీస్  ఎస్సార్ట్ తో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ దాడి చేశారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలను సీఎం రేవంత్ రెడ్డి కాపాడలేపోయారన్నారు.

హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదనే కోపంతో, ఇక్కడి ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని విమర్శించారు. అందుకే నగర ప్రజల పైకి హైడ్రా తీసుకొచ్చారని తెలిపారు. నగరంలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని సీఎం చూస్తున్నారన్నారు. తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని ఆయన తెలిపారు.  తాము చాలా మంది ముఖ్యమంత్రులతోనే కొట్లాడమని, సీఎం రేవంత్ రెడ్డి చిన్నబ్బాయి అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎవరికి అధికారం శాశ్వతం కాదని, అధికారం ఉందని విర్రవీగడం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. పోలీసుల ఎస్కార్ట్ ఇచ్చి మరీ కౌశిక్ రెడ్డి ఇంటిపై  సీఎం రేవంత్ రెడ్డి దాడి చేయించరని తెలిపారు. దాడికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయాలను కాంగ్రెస్ దిగజార్చుతోందని కేటీఆర్ మండిపడ్డారు. విదేశీయ పర్యటన ముగించుకుని కేటీఆర్ శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో తొలుత కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి..ఆయనను పరామర్శించారు. కౌశిక్  రెడ్డి ఇంటిపై జరిగిన దాడి తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మరి..కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి..కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలనును కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments