iDreamPost
iDreamPost
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగికదాడి ఘటనలో, బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో మీడియాకు విడుదల చేశారు. ఇలా చేయడం చట్టపరంగా నేరం. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 228ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.,
బాలిక వీడియోలు బైటకు తీసుకొచ్చిన పాతబస్తీకి చెందిన వెబ్ రిపోర్టర్ సుభాన్ కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అత్యాచారానికి గురైనబాధితుల వివరాలు బయటకు చెప్పకూడదన్నది సుప్రీం కోర్టు ఆదేశాలు. అయినా సరే, కారులోని వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.అసలు వీడియోలు తీసింది ఎవరు? ఏ ఉద్దేశంతో తీశారు? అవి ఎలా బైటకు వచ్చాయో ఆధారాలు దొరికిన తర్వాతనే చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు మరోసారి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీనితోపాటు, దర్యాప్తులో వెల్లడైన అంశాలను బట్టి ఎమ్మెల్యే కొడుకును కూడా నిందితుడిగా ఈ కేసులో చేర్చే అవకాశం ఉంది.ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, ఈ కేసులో తెరవెనుక సూత్రధారులు ఎవరున్నారనే దానిపై వాళ్ల నుంచి వివరాలు సేకరించనున్నారు. రారీలో ఉన్న ఉమేర్‌ఖాన్ ఆచూకీనికూడా పోలీసులు గుర్తించారు.