బ్రేకింగ్: లోక్ సభలో ఆగంతుకుల దాడి.. భయంతో MPలు పరుగు!

Big Security Breach In Lok Sabha: లోక్ సభలో తీవ్ర భద్రతా వైఫల్యం జరిగింది. ఇద్దరు ఆగంతుకులు లోక్ సభలో దాడికి దిగారు. అక్కడున్న ఎంపీలు భయంతో పరుగులు తీశారు.

Big Security Breach In Lok Sabha: లోక్ సభలో తీవ్ర భద్రతా వైఫల్యం జరిగింది. ఇద్దరు ఆగంతుకులు లోక్ సభలో దాడికి దిగారు. అక్కడున్న ఎంపీలు భయంతో పరుగులు తీశారు.

లోక్ సభలో భద్రతా వైఫ్యలం.. అందరినీ షాక్ కి గురి చేసింది. జీరో అవర్ జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతుకులు చేసిన పనికి ఎంపీలు షాక్ కి గురయ్యారు. సభ జరుగుతూ ఉండగా ప్రాంగణంలోకి దూకి పొగ బాంబును ప్రయోగించాడు. మొదట విజిటర్స్ గ్యాలరీలో ఉన్న యువకుడు సభలో అటూ ఇటూ పరుగులు పెట్టాడు. కుర్చీలు, బల్లలు మీదకు దూకుతూ హల్చల్ చేశాడు. ఆ తర్వాత తన షూస్ లో దాచుకున్న గ్యాస్ క్యాన్ ని బయటకు తీసి ప్రయోగించాడు. ఆ క్యాన్ లో నుంచి పసుపు రంగులో పొగ బయటకు వచ్చింది. అది టియర్ గ్యాస్ అంటూ చెబుతున్నారు. ఆ తర్వాత ఎంపీలు కొందరు భయంతో పరుగులు పెట్టగా.. కొందరు మాత్రం ఆ యువకుడిని నిలువరిచేందుకు అతడిని చుట్టుముట్టారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుంది. అతనితో మరో మహిళ కూడా ఉంది.

ఆ ఇద్దరినీ సెక్యూరిటీ అదుపులోకి తీసుకుని అసలు ఏ లక్ష్యంతో ఈ పనికి దిగారు అంటూ దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడిని సాగర్ గా గుర్తించారు. వాళ్లు సభలో తానాషాహీ నహీ చలేగీ అంటూ నినాదాలు చేశారు. అంటే నియంతృత్వ పోకడలు పనికిరావు అంటూ నినాదాలు చేశారు. ఈ మొత్తం ఘటనపై స్పీకర్ ఓం బిర్లా.. భద్రతా సిబ్బందిని నివేదిక కోరారు. భద్రతా సిబ్బంది కూడా వాళ్లు అసలు ఇలాంటి ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో స్పీకర్ చైర్ లో ఉన్న బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ స్పందించారు. “ఈ ఘటనలో వైఫల్యం ఉన్న మాట వాస్తవమే. మొదటి వ్యక్తి సభలోకి దూకినప్పుడు మేమంతా అతను పొరపాటున కింద పడిపోయాడు అనుకున్నాం. కానీ, రెండో వ్యక్తి కిందకు దిగడం ప్రారంభించిన తర్వాత మేము అలర్ట్ అయ్యాం. ఆ యువకుడు తన షూస్ లో ఉంచుకున్న క్యాన్ ని బయటకు తీశాడు. ఆ సమయంలో గ్యాస్ అనేది విడుదలైంది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్పీకర్ ఓం బిర్లా.. సంబధింత అధికారులు ఈ ఘటనపై నిర్ణయం తీసుకుంటారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ ఘటన జరిగిన వెంటనే సభ వద్దకు చేరుకున్నారు” అంటూ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ వ్యాఖ్యానించారు.

ఘటనపై సభ బయటకు వచ్చిన ఎంపీలు కూడా స్పందించారు. ఈ ఘటన చూసి తాము నిర్ఘాంతపోయామన్నారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి ముందు ఒక యువకుడు సభలోకి దూకాడు. ఆ తర్వాత అతను అటూ ఇటూ పరుగులు పెట్టాడని చెప్పారు. అతని బూట్లలో దాచుకున్న ఏదో సంచిలాంటిది బయటకు తీసి గ్యాస్ లాంటి వాయువు విడుదల చేసినట్లు ప్రత్యక్షంగా చూసిన ఎంపీలు చెబుతున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి చిన్న విషయం కావచ్చు.. కానీ, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అది ఎంత దూరం దారితీస్తుందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని లోక్ సభలో జరిగిన తీవ్ర భద్రతా వైఫల్యంగా చెబుతున్నారు. పార్లమెంటుపై దాడి జరిగిన 22 ఏళ్ల తర్వతా ఇలాంటి ఘటన జరగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. లోక్ సభలో జరిగిన దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments