iDreamPost
android-app
ios-app

హర్షసాయిపై బిగ్ బాస్ నటి ఫిర్యాదు! పెళ్లి చేసుకుంటా అని నమ్మించి!

  • Published Sep 24, 2024 | 7:51 PM Updated Updated Sep 24, 2024 | 9:10 PM

Harsha Sai: హర్ష సాయి యూ ట్యూబ్ ద్వారా సెన్సేషన్ అయ్యారు. తన కంటెంట్ తో లక్షల అభిమానులను సంపాదించుకున్నారు.

Harsha Sai: హర్ష సాయి యూ ట్యూబ్ ద్వారా సెన్సేషన్ అయ్యారు. తన కంటెంట్ తో లక్షల అభిమానులను సంపాదించుకున్నారు.

  • Published Sep 24, 2024 | 7:51 PMUpdated Sep 24, 2024 | 9:10 PM
హర్షసాయిపై బిగ్ బాస్ నటి ఫిర్యాదు! పెళ్లి చేసుకుంటా అని నమ్మించి!

హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూ ట్యూబ్ ద్వారా సెన్సేషన్ అయ్యారు. తన కంటెంట్ తో ఎన్నో లక్షల అభిమానులను సంపాదించుకున్నారు. పేద వాళ్ళకు సాయం చేస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరయ్యారు. మొదట్లో యూట్యూబర్‌గా కెరియర్‌ స్టార్ట్ చేసిన హర్షసాయి..ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్‌గా పేరు తెచ్చుకున్నాడు. కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, క్రియేటివ్ థాట్స్‌తో రీల్స్‌, వీడియోలు, షార్ట్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో హర్షసాయికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. త్వరలో వెండితెరపై కూడా అడుగుపెట్టడానికి సిద్ధం అవుతున్నాడు హర్షసాయి. మెగా అనే పేరుతో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈ సినిమా టీజర్‌ను కూడా లాంచ్‌ చేశారు.

అయితే కొన్నాళ్ళ నుంచి హర్ష సాయి వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఇటివలే బెట్టింగ్ యాప్స్ లో చిక్కుకున్న హర్ష సాయి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా హర్ష సాయిపై ఓ యువతీ చీటింగ్ కేసు పెట్టింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆ యువతి హర్షపై నార్సింగి పోలిస్ స్టేషన్లో కేసుపెట్టింది. పెళ్లి పేరుతో తనని నమ్మించి ఏకంగా 2 కోట్లు తీసుకున్నాడని ఆ యువతీ తెలిపింది. అంతే గాక హర్ష సాయి తండ్రి రాధా కృష్ణపై కూడా కంప్లైంట్ ఇచ్చింది ఆ యువతీ. ఆ యువతీ ఇచ్చిన స్టేట్ మెంట్ ని పోలీసులు రికార్డు చేశారు. హర్ష సాయిపై చీటింగ్ కేసు పెట్టిన ఆ యువతీ పాత బిగ్ బాస్ కంటెన్స్టంట్ అని సమాచారం తెలుస్తుంది. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom