iDreamPost
android-app
ios-app

నోటి తీటను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారా అయ్యన్నా?

  • Published Mar 02, 2022 | 8:24 AM Updated Updated Dec 23, 2023 | 6:08 PM

తనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాయడం సరైంది కాదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనడాన్ని అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియోలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు తనపై తొమ్మిది కేసులు నమోదు చేశారని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిని వ్యతిరేకిస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని అన్నారు.

తనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాయడం సరైంది కాదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనడాన్ని అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియోలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు తనపై తొమ్మిది కేసులు నమోదు చేశారని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిని వ్యతిరేకిస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని అన్నారు.

నోటి తీటను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారా అయ్యన్నా?

తనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాయడం సరైంది కాదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనడాన్ని అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియోలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు తనపై తొమ్మిది కేసులు నమోదు చేశారని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిని వ్యతిరేకిస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని అన్నారు. నర్సీపట్నంలో అక్రమ మైనింగ్‌ ఆపాలని,  ప్రకృతి సంపదను దోచుకొనే అధికారం వైఎస్సార్‌ సీపీ నేతలకు లేదని వ్యాఖ్యానించారు.

నోటికొచ్చినట్టు మాట్లాడితే కేసులు పెట్టరా..

ముఖ్యమంత్రి పైన, మంత్రుల పైన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న అయ్యన్న పాత్రుడు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి మాట్లాడడం మరీ ఎబ్బెట్టుగా ఉందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఒక మాజీ మంత్రిని అనే స్పృహ కూడా లేకుండా సీఎంపై అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు తెగబడడం భావవ్యక్తీకరణ అవుతుందా? తనపై 9 తొమ్మిది కేసులు నమోదు చేశారని వాపోతున్న అయ్యన్నకు అవి ఎందుకు నమోదు చేశారో తెలియదా? చౌకబారు ప్రచారం కోరుకుంటూ మీడియా ముందు బజారు భాషతో చిందులు తొక్కడం సరైన పద్దతా? అని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఎం, మంత్రుల పైనే కాదు.. ఎవరిపై అభ్యంతరకర భాషతో మాట్లాడినా పోలీసులు కేసులు పెడతారు. తాను మాజీ మంత్రినని, ఇష్టానుసారం మాట్లాడతానని కేసులు పెట్టకూడదు అంటే ఎలా? అని అడుగుతున్నారు.

నిజాయితీ ఉంటే  తప్పుడు కేసులు అని నిరూపించుకోండి..

పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇంట్లో దాక్కొని, ఇప్పుడు ఇలా వీడియోలు విడుదల చేస్తూ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏమిటి? నిజాయితీ, ధైర్యం ఉంటే పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారు అని నిరూపించుకోవాలి. అంతేగాని దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అయ్యన్న నోట భావవ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి మాటలు వినడానికి ఇబ్బందిగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. దొంగే.. దొంగా దొంగా అని అరచినట్టు తెలుగుదేశం అధికారంలో ఉండగా అక్రమ మైనింగ్‌, గంజాయి వ్యాపారంలో కోట్ల రూపాయలు గడించిన అయ్యన్న ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఆధారాలు చూపవచ్చు కదా.

ఏ ఆధారం లేకుండా ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం, దానికి విపరీతంగా ప్రచారం కల్పించడం టీడీపీ నేతలకు అలవాటుగా మారింది. సీఎం అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తనపై కేసులు పెట్టారని ఆరోపిస్తున్న అయ్యన్న అందుకు తగిన ఆధారాలు చూపి ప్రభుత్వాన్ని జనం ముందు, న్యాయస్థానాల్లోనూ దోషిగా నిలబెట్టవచ్చు కదా? అది మానేసి ఇలా మీడియాలో హడావుడి చేస్తున్నారు అంటే తాను చేస్తున్నవి నిరాధార ఆరోపణలని అర్థం అవుతోందని అధికార పార్టీ నేతలు అంటున్నారు.