iDreamPost
android-app
ios-app

CM జగన్ పై దాడి కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్!

Attack On CM Jagan Case: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో పోలీసులు న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఆ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించారు.

Attack On CM Jagan Case: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో పోలీసులు న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఆ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించారు.

CM జగన్ పై దాడి కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్!

ఈ నెల 13న ముఖ్యమంత్రి జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో దాడి జరిగిన విషయం తెలిసిందే. విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్లా సెంటర్లో సీఎం జగన్ పై రాయితో దాడి చేశారు. ఈ కేసులో సతీశ్ అనే యువకుడిని ఏ1గా చేర్చగా.. టీడీపీ బీసీ సెన్ కార్యదర్శి దుర్గారావు ఏ2గా ఉన్నాడు. ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీశ్ కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఏ1 సతీశ్ ని నెల్లూరు సబ్ జైలుకు పోలీసులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీఎం జగన్ ని హత్య చేయాలనే ఉద్దేశంతోనే పదునైన రాయితో దాడి చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు.

రిమాండ్ రిపోర్ట్:

పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. హత్య చేసేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేసినట్లు వెల్లడించారు. ముందుగా ఒకసారి దాడి చేయగా ఆ రాయి తగలలేదని.. మరో 100 మీటర్లు ముందుకు వెళ్లి వివేకానంద స్కూల్ వద్ద దాడి చేశాడని చెప్పారు. స్కూల్ ప్రహరీకి ఆనుకుని ఉన్న బెంచ్ వద్ద సతీశ్ దాడి చేసినట్లు చెప్పారు. కొందరు యువకులు అక్కడ ఉండగా వారి వెనుక నుంచి ఈ దాడి చేసినట్లు చెప్పారు. ఈ దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి సెల్ ఫోన్ కదలికలను కూడా పరిశీలించారు. ఈ దాడి కేసులో టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి దుర్గారావు ఏ2గా ఉన్నారు. అసలు సూత్రధారి దుర్గారావు అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించారు.

దుర్గారావు పోత్సాహంతోనే ఈ దాడి జరిగినట్లు చెప్పారు. సతీశ్ కు డబ్బు ఆశ చూపి ఈ దాడి చేయించినట్లు స్పష్టం చేశారు. దాడి చేసిన తర్వాత సతీశ్ దుర్గారావుకు ఫోన్ చేసిన విషయాన్ని కనుగొన్నారు. మొదటిసారి లిఫ్ట్ చేసి మాట్లాడి.. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తెలిపారు. అసలు ఈ దాడి వెనుక దుర్గారావు అవసరం ఏంటి? ఉద్దేశం ఏంటి? అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దుర్గారావు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. త్వరగానే దుర్గారావును కూడా పోలీసులు అరెస్టు చేసే ఆస్కారం ఉంది. ఈ కేసులో సతీశ్ చెప్పే విషయాలు కూడా కీలకంగా మారబోతున్నాయి.