Dharani
Gudivada Amarnath: నారా లోకేష్ అనకాపల్లి సభలో చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. గుడివాడ్ అమర్నాథ్ పంపిన రిటర్న్ గిఫ్ట్, చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
Gudivada Amarnath: నారా లోకేష్ అనకాపల్లి సభలో చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. గుడివాడ్ అమర్నాథ్ పంపిన రిటర్న్ గిఫ్ట్, చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
Dharani
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జోరందుకుంటుంది. ఓవైపు అధికార పార్టీ నేతలు.. ఈ 56 నెలల కాలంలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. రానున్న రోజుల్లో ఏం చేయనున్నారో.. తెలుపుతూ ప్రజల మధ్యకి వెళ్తుండగా.. విపక్ష కూటమికి ఏమని ప్రచారం చేసుకోవాలో అర్థం కావడం లేదు. అధికార పార్టీని ఎలా విమర్శించాలో.. ప్రజల ముందు వారిని ఎలా దోషులుగా నిలపాలో అర్థం కాక వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా అనకాపల్లిలో జరిగిన శంఖారావం సభలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూసిన వారేవరైనా ఇదే మాట అంటారు. ఎంతసేపు వైసీపీని విమర్శించడం తప్పితే.. అసలు తాము ప్రజలకు ఏం చేశాం.. అధికారంలోకి వస్తే.. ఏం చేస్తాం అన్న దాని గురించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు లోకేష్ అంటున్నారు జనాలు.
తాజాగా శంఖారావం సభ కోసం అనకాపల్లి వచ్చిన లోకేష్.. అక్కడ సిట్టంగ్ ఎమ్మెల్యే అయిన గుడివాడ అమర్నాథ్ మీద విమర్శలు చేశారు. గుడ్డు మంత్రి అంటూ ఎద్దేవా చేస్తూ.. సభలోనే గుడ్డును చూపించారు. ఈక్రమంలో లోకేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గుడివాడ అమర్నాథ్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక ముంతలో ఉడకబెట్టిన పప్పు తీసుకువచ్చి.. మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేష్‌కు ముంత పప్పు పంపుతున్నాను అన్నారు. అంతేకాక దీనిలో ఉత్తరాంధ్ర కారం, ఉప్పు గట్టిగా దంటించామని.. ఇది తిన్న తర్వాత అయినా చంద్రబాబు, లోకేష్‌లకు రోషం పుట్టుకురావాలంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అంతేకాక లోకేష్ మాదిరి తాను చెత్త పొలిటీషియన్‌ని కాదన్నారు గుడివాడ్ అమర్నాథ్. అసలు లోకేష్‌కు శంఖారావం అన్న పేరు కూడా సరిగా పలకరాదని.. తాను అలాంటి మొద్దబ్బాయ్‌ని కాదంటూ సెటైర్లు వేశారు. బంధుత్వాలు, రక్త సంబంధాల గురించి లోకేష్ మాట్లాడకపోవడమే ఉత్తమం అంటూ విమర్శించారు. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వలన మంత్రి అయ్యానని చెప్పుకొచ్చారు గుడివాడ అమర్నాథ్.
లోకేష్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు అమర్నాథ్. విస్సన్నపేట భూముల కుంభకోణం అంటూ ఏదేదో అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్న అమర్నాథ్.. పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లి ఏం సాధించాడని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తున్న లోకేష్ , చంద్రబాబు.. ఉత్తరాంధ్ర కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
ఎర్ర పుస్తకం పట్టుకుతిరుగుతున్న లోకేష్‌కు అందులో ఫస్ట్ పేజీ కూడా తెరిచే ఛాన్స్ కూడా రాదన్నారు అమర్నాథ్. అంతేకాక తాము 2019లోనే టీడీపీ కుర్చీలు మడతపెట్టామని.. ఇప్పుడు లోకేష్ తన చేతిలో ఉన్న ఎర్ర పుస్తకం కూడా మడతపెట్టాల్సిందే అన్నారు. సిద్ధం సభల తర్వాత జనంతో సీఎం జగన్‌నిక ఉన్న బంధాన్ని ఎవరూ తెంచలేరని అర్థం అయ్యింది.. అందుకే టీడీపీ నేతలు ఇలా పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఐటీ మంత్రిగా తాను ఏం చేశానో శ్వేత పత్రం విడుదల చేయడానికి తాను సిద్ధం అని.. అలానే టీడీపీ హయాంలో ఏం జరిగిందో శ్వేత పత్రం విడుదల చేయగలరా అంటూ సవాల్ విసిరారు గుడివాడ్ అమర్నాథ్.