RK రోజా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందారు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులపై తన మాటలతో ఎదురుదాడి చేస్తుంటారు రోజా. కానీ కొన్ని రోజులుగా ఆమె సైలెంట్ అయిపోయారు. దానికి కారణం.. ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడమే. శనివారం రాత్రి రోజా అస్వస్థతకు గురికావడంతో.. ఆమెను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు కాలు బెణకడంతో.. వారం రోజుల పాటు ఫిజియోథెరపీ అందించారు. అయినప్పటికీ నొప్పి తక్కువ కాకపోవడం, కాలువాపు రావడంతో.. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన సంక్షమ శాఖ మంత్రి ఆర్కే రోజా అస్వస్థతకు గురైయ్యారు. గత కొన్ని రోజులుగా రోజా వెన్ను నొప్పి, కాలు నొప్పితో బాధపడుతున్నారు. ఈ రెండు సమస్యలకు చికిత్సను సైతం ఆమె తీసుకుంటున్నారు. అయితే బెనికిన కాలు వాపు రావడంతో.. ఆమెను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కారణం చేతనే ఆమె నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదీకాక మరో రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.