iDreamPost
android-app
ios-app

Chandrababu: చంద్రబాబుకు ఎన్నికల సంఘం భారీ షాక్.. 48 గంటల డెడ్‌లైన్ విధింపు

  • Published Apr 05, 2024 | 8:50 AM Updated Updated Apr 05, 2024 | 8:50 AM

ఎన్నికల వేళ చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు..

ఎన్నికల వేళ చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published Apr 05, 2024 | 8:50 AMUpdated Apr 05, 2024 | 8:50 AM
Chandrababu: చంద్రబాబుకు ఎన్నికల సంఘం భారీ షాక్.. 48 గంటల డెడ్‌లైన్ విధింపు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇక ఎన్నికల ముందు విపక్ష కూటమి.. జగన్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీని అడ్డుకుంది. అయితే అది కాస్త బెడిసికొట్టింది. అవ్వాతాతలు, వికలాంగులు చంద్రబాబు అండ్ కో మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబుకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. 48 గంటల డెడ్ లైన్ విధించింది. ఆ వివరాలు..

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల ప్రజా గళం సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్‌‌సీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ.. జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణులు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఈసీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ప్రాథమికంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బాబుకు నోటీసు ఇచ్చారు.

చంద్రబాబు తన ప్రసంగంలో.. సీఎం జగన్‌ను ఉద్దేశించి ‘దొంగ, రాక్షసుడు, జంతువులు, హు కిల్డ్‌ బాబాయి’ వంటి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈసీ ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా ఈసీకి అందించారు. దీంతోపాటు యూట్యూబ్‌ లింక్‌లు కూడా ఇచ్చారు.

అప్పిరెడ్డి ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం.. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధం. రెచ్చగొట్టేలా, ఇతరులను కించపరిచేలా, వ్యక్తిగత విమర్శలు చేయడం నేరం. ఈ నేపథ్యంలో లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా దీనిపై స్పందించాలని ఆదేశించింది. మరి ఈ నోటీసులపై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.