iDreamPost
android-app
ios-app

వీడియో: మాజీ మంత్రిపై షూ విసిరిన యువకుడు!

వీడియో: మాజీ మంత్రిపై షూ విసిరిన యువకుడు!

ఉత్తర్ ప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ సభలో ఓ పార్టీకి చెందిన నాయకుడు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఓ యువకుడు ఉన్నట్టుండి షూ విసిరి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశాడు. కార్యకర్తలు అప్రమత్తమై అతడిని పట్టుకుని చితకబాదారు. దీంతో అక్కడ ఆ సమావేశంలో గందోరగోళం ఏర్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు సోమవారం పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది నాయకులు, పార్టీ కార్యరర్తలు హాజరయ్యారు. మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా ఉన్నట్టుండి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇక అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు ఆ యువకుడుని పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇదిలా ఉంటే.. స్వామి ప్రసాద్ మౌర్యపై ఆ యువకుడు షూ ఎందుకు విసిరాడనే కారణం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: వీడియో: నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన యువతి