iDreamPost
android-app
ios-app

Saindhav: OTTలోకి సైంధవ్‌.. ఆరోజు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్

  • Published Jan 31, 2024 | 11:34 AM Updated Updated Jan 31, 2024 | 4:43 PM

Saindhav OTT Release Data & Streaming Platform: విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌లో 75వ సినిమాగా భారీ బడ్జెట్‌తో, అంచనాల మధ్య వచ్చిన సినిమా సైంధవ్‌. తాజాగా దీని ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. ఆ వివరాలు..

Saindhav OTT Release Data & Streaming Platform: విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌లో 75వ సినిమాగా భారీ బడ్జెట్‌తో, అంచనాల మధ్య వచ్చిన సినిమా సైంధవ్‌. తాజాగా దీని ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. ఆ వివరాలు..

  • Published Jan 31, 2024 | 11:34 AMUpdated Jan 31, 2024 | 4:43 PM
Saindhav: OTTలోకి సైంధవ్‌.. ఆరోజు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్

విక్టరీ వెంకటేష్‌ హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్‌. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. వెంకటేష్‌ కెరీర్‌లో 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్‌.. భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది.. కానీ అనుకున్న మేర రాణించలేకపోయింది. హిట్‌, హిట్‌ 2 లాంటి వరుస సక్సెస్‌ సినిమాలు అందించిన శైలేష్‌ కొలను.. సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం బ్రేక్‌ ఈవెన్‌ కూడా సాధించలేదని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌.

ఆ సంగతి అలా ఉంచితే.. గత రెండుమూడేళ్లుగా థియేటర్లో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీలో కూడా వస్తుంది. కొన్ని సినిమాలైతే నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో వెంకటేష్‌ సైంధవ్‌ సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. థియేటర్ల నుంచి తప్పుకున్న ఈ సినిమా.. విడుదలై కనీసం నెల రోజుల కూడా పూర్తి కాక ముందే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.

SAINDAV MOVIE IN OTT

సాధారణంగా ఈ సినిమా ఫిబ్రవరి 9న ఓటీటీలోకి వస్తుంది అనుకున్నారు. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం.. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే అంటే.. ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానుంది. తాజాగా మేకర్స్ ఈ న్యూస్ ను అధికారికంగా ప్రకటించారు. సైంధవ్‌ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు 15 కోట్ల రూపాయలకు అమెజాన్‌ సైంధవ్‌ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.

సంక్రాతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం, హనుమాన్‌, నా సామిరంగ సినిమాలు మంచి వసూళ్లను సాధించగా.. సైంధవ్‌ మాత్రం చాలా నిరాశ పర్చింది. పండగ మూడ్‌ అంటే ఇంటిల్లిపాది వచ్చి సినిమాలు చూస్తారు. అలాంటి తరుణంలో దర్శకుడు శైలేష్‌ కొలను.. ఫ్యామిలీ హీరో అన్న ముద్ర ఉన్న వెంకటేష్‌తో ఫుల్‌ లెంత్‌ యాక్షన్‌ సినిమాను తెరకెక్కించి విడుదల చేశాడు. పండగ మూడ్‌ని అర్థం చేసుకోలేక యాక్షన్‌ జానర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటించగా, ఆర్య, ఆండ్రియా, ముకేశ్‌ రిషి, బేబీ సారా, రుహానీ శర్మ మిగతా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇక ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ చిత్రం ఎంతవరకు ఆడియన్సును ఆకట్టుకుంటుందో చూడాలి. మరి, సైంధవ్‌ ఓటీటీ రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.