OTT Release Movies-Aug 19-25th 2024: ఈ వారం OTTలో సినిమా జాతర.. ఏకంగా 18 చిత్రాలు.. ఆ 3 మాత్రం చాలా స్పెషల్‌

ఈ వారం OTTలో సినిమా జాతర.. ఏకంగా 18 చిత్రాలు.. ఆ 3 మాత్రం చాలా స్పెషల్‌

OTT Release Movies-Aug 19-25th 2024: మరో వీకెండ్‌ వచ్చేసింది. ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర జరగబోతుంది. ఏకంగా 18 సినిమాలు రానున్నాయి. ఆ వివరాలు..

OTT Release Movies-Aug 19-25th 2024: మరో వీకెండ్‌ వచ్చేసింది. ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర జరగబోతుంది. ఏకంగా 18 సినిమాలు రానున్నాయి. ఆ వివరాలు..

సోమవారం వచ్చిదంటే కొత్త వీకెండ్‌ స్టార్ట్‌ అయినట్లే. కొంత కాలం వరకు కూడా వీకెండ్‌ అంటే అదేదో సాఫ్ట్‌వేర్‌ వాళ్లకు సంబంధించిన మ్యాటర్‌ అనుకునేవాళ్లం. కానీ ఓటీటీలకు క్రేజ్‌ పెరిగిన తర్వాత.. ఇప్పుడు వీకెండ్‌ కోసం ఎదురు చూసే ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. థియేటర్లలో పెద్దగా మంచి చిత్రాలు లేకపోవడం.. టీవీల్లో కూడా ఇంట్రెస్టింగ్‌ కంటెంట్‌ టెలికాస్ట్‌ కాకపోవడంతో.. మూవీ లవర్స్‌ అందరూ ఓటీటీలకే జై కొడుతూ వాటిల్లో రాబోయే సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. ఈ వారం ఓటీటీల్లో మూవీల జాతర కొనసాగనుంది. ఆ రేంజ్‌ సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక ఈ వీకెండ్‌లో 18 సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుండగా.. వాటిల్లో మూడు చిత్రాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. ఆ జాబితా మీ కోసం.

ఇక ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల సంగతి అలా ఉంచితే.. థియేటర్లలోకి మాత్రం పెద్ద సినిమాలు ఏవి రావడం లేదు. చిన్న మూవీలు, డబ్బింగ్‌ చిత్రాలు విడుదల కాబోతున్నా.. వాటిల్లో ఒక్క సినిమా మీద కూడా ప్రేక్షకులకు ఆసక్తి లేదు. ఈ శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో మారుతీనగర్‌ సుబ్రహ్మణం అనే తెలుగు సినిమా, డీమోంటీ కాలనీ 2 అనే డబ్బింగ్‌ మూవీలు మాత్రమే ఉన్నాయి.

ఇక ఓటీటీల్లోకి రాబోతున్న 18 సినిమాల్లో డార్లింగ్‌ ప్రభాస్‌ కల్కి, ధనుష్‌ రాయన్‌ లాంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. వీటితో పాటు గర్‌ర్‌ర్‌ అనే డబ్బింగ్‌ మూవీ మీద కూడా విపరీతమైన ఆసక్తి ఉంది. మరి ఈ వారం ఏ ఓటీటీల్లో ఏ సినిమా, వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రాబోతుందో ఆ జాబితా ఇక్కడ మీ కోసం.

ఈ వారం(ఆగస్టు19-25) ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో..

  • టెర్రర్ ట్యూజ్‌డే: ఎక్స్‌ట్రీమ్ (థాయ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20
  • జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
  • కల్కి 2898 ఏడీ (హిందీ వెర్షన్) – ఆగస్టు 22
  • మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
  • ప్రె‍ట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ద మూవీ పార్ట్ 1 (జపనీస్ మూవీ) – ఆగస్టు 22
  • ఇన్ కమింగ్ (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 23
  • ద ఫ్రాగ్ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 23

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • యాంగ్రీ యంగ్ మ‍్యాన్: ద సలీం జావేద్ స్టోరీ (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 20
  • కల్కి 2898 ఏడీ (తెలుగు సినిమా) – ఆగస్టు 22
  • ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 23
  • రాయన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 23

ఆహా

  • ఉనర్వుగల్ తొడరకథై (తమిళ సినిమా) – ఆగస్టు 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 20
  • ద సుప్రీమ్స్ ఎట్ ఎర్ల్స్ ఆల్ యూ కెన్ ఈట్ (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 23

మనోరమ

  • స్వకార్యం సంభవబాహులం (మలయాళం సినిమా) – ఆగస్టు 23

ఆపిల్ ప్లస్ టీవీ

  • పచింకో సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 23

లయన్స్ గేట్ ప్లే

  • ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 23

జియో సినిమా

  • డ్రైవ్ ఏవే డాల్స్ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 23
Show comments