iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన తెలుగు బో* మూవీ Evol.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Evol Movie: ఓటీటీలోకి మరో తెలుగు బోల్డ్ మూవీ వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండానే నేరుగా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పోస్టర్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Evol Movie: ఓటీటీలోకి మరో తెలుగు బోల్డ్ మూవీ వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండానే నేరుగా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పోస్టర్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

OTTలోకి వచ్చేసిన తెలుగు బో* మూవీ Evol.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం అనేక జోనర్లలో సినిమాలు తెరకెక్కి..ప్రేక్షకలును ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హార్రర్, కామెడీ, రోమాంటిక్ మూవీ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో వారం వారం  ఓటీటీల్లోకి అనేక సినిమాలు వస్తుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైన తరువాత ఓటీటీ ప్లాట్ ఫామ్ పైకి వస్తుంటాయి. మరికొన్ని మాత్రం నేరుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. తాజాగా తెలుగు రోమాంటిక్ బోల్డ్ మూవీ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ సినిమా ఏంటి, ఎక్కడ చూసేయాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ మధ్య తెలుగులో  చాలా బోల్డ్ రొమాంటిక్ సినిమాలు రూపొందుతున్నాయి. అలాంటి మూవీలో ఎవోల్  ఒకటి. థియేటర్ లో కాకుండా  ఈ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా నేటి నుంచి ఆఅంటే…గురువారం, ఆగస్ట్ 15 నుంచే ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొత్తంగా ఈ ఎవోల్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్ డేట్  చేసిన సంగతి తెలిసింది. తాజాగా గురువారం ఆగష్టు 15 రోజు కూడా సినిమా స్ట్రీమింగ్ మొదలైనట్లు వెల్లడించింది. “చీకటి నిజాలు ప్రేమను శాసిస్తాయా?” అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఎవోల్ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.

ఎవోల్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వచ్చేసింది. ఇక మేకర్స్ వదిలిన పోస్టర్ చూస్తేనే ఈ సినిమా ఎంత బోల్డ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రెండు జంటల మధ్య నడిచే లవ్ స్టోరీతో ‘ఎవోల్​’ను రూపొందించారు. చిత్రంలో నటీనటులంతా కొత్తవారే కావడం విశేషం. రామ్ వెలగపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ ఎవోల్ మూవీలో నరేష్, రాగ్ మయూర్ కీలకపాత్రలు పోషించారు. నిజానికి ఎవోల్ కి అర్థం ఏమీ లేదు. దానిని తిరగేసి చదివితే లవ్ అని వస్తుంది. ఈ మూవీ పోస్టర్ చూస్తేనే ఇదెంత బోల్డ్ మూవీయో అర్థమవుతోంది. ఓ బెడ్ పై అర్ధనగ్నంగా ఓ జంట పడుకోవడం ఈ పోస్టర్ లో చూడొచ్చు.

ఈ సినిమా ట్రైలర్ గతేడాది డిసెంబర్​లో రిలీజ్ అయింది. సెన్సార్ అడ్డంకుల కారణంగా ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. ఇక ఈ ఫిల్మ్ ట్రైలర్ చూసినట్లు అయితే ఈమధ్య కాలంలో ఇలాంటి కంటెంట్​తో రాని చిత్రంగానే కనిపిస్తోంది. గతంలోనూ ఇలాంటి రొమాంటిక్ సినిమాలను స్ట్రీమింగ్ చేసిన ఆహా.. మరోసారి అలాంటి జానర్ చెందిన ఈ మూవీనే స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే సినిమా ఎలా ఉందో తెలియాలంటే..ఆహాలోకి వెళ్లి చూసేయండి. ఇక ఆగస్టు 15న ఆహా వీడియోలో ఈ ఎవోల్ తోపాటు కమెడియన్ వెన్నెల కిశోర్ నటించిన ఓఎంజీ ఓ మంచి ఘోస్ట్ కూడా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అటు జీ5 ఓటీటీలో మలయాళ ఆంథాలజీ మనోరతంగల్ స్ట్రీమింగ్ కూడా జరుగుతోంది.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet