సెన్సార్ బోర్డు బ్యాన్​​తో డైరెక్ట్​గా OTTలోకి EVOL.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మామూలుగా ఏ సినిమా అయినా మొదట థియేటర్లలో రిలీజై ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కేవలం ఓటీటీ కోసమే తీసినవి డైరెక్ట్​గా స్ట్రీమ్ అవుతాయి. కానీ ఈ చిత్రం మాత్రం బ్యాన్ కారణంగా నేరుగా ఓటీటీలోకి వస్తోంది.

మామూలుగా ఏ సినిమా అయినా మొదట థియేటర్లలో రిలీజై ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కేవలం ఓటీటీ కోసమే తీసినవి డైరెక్ట్​గా స్ట్రీమ్ అవుతాయి. కానీ ఈ చిత్రం మాత్రం బ్యాన్ కారణంగా నేరుగా ఓటీటీలోకి వస్తోంది.

మామూలుగా ఏ సినిమా అయినా మొదట థియేటర్లలో రిలీజై ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కేవలం ఓటీటీ కోసమే తీసినవి కూడా అందులోనే స్ట్రీమ్ అవుతాయి. కానీ ఈ చిత్రం మాత్రం బ్యాన్ కారణంగా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. సాధారణంగా చిన్న చిత్రాలకు విడుదల ఇబ్బందులు ఉంటాయనేది తెలిసిందే. సరిగ్గా థియేటర్లు దొరక్కపోవడం అనేది ఒక ఇష్యూ. అయితే స్క్రీన్స్ దొరికినా పూర్ కంటెంట్ వల్ల ఎన్నో స్మాల్ మూవీస్ రిలీజైన రోజే మాయమైపోతుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం కాంట్రవర్సీల వల్ల ఫేమస్ అయి ఆడియెన్స్ దృష్టిలో పడుతుంటాయి. అలాంటి ఓ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఆ మూవీనే ‘ఎవోల్’. దీనికి స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

సెన్సార్ చిక్కుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ‘ఎవోల్’ ఇప్పుడు డైరెక్ట్​గా ఓటీటీలోకి వస్తోంది. ఆంగ్లంలో లవ్ అనే పదాన్ని తిరగేసి రాస్తే ‘ఎవోల్’ అవుతుంది. ఈ టైటిల్​తో రామ్ వెలగపూడి అనే యంగ్ డైరెక్టర్ ఫిల్మ్ తీశారు. జులైలోనే థియేటర్లలోకి రావాల్సిన ఈ తెలుగు చిత్రం.. కొన్ని కారణాల వల్ల ప్రదర్శించబడలేదు. బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ‘ఎవోల్​’ను సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది. దీంతో వేరే మార్గం లేక మేకర్స్ ఓటీటీ బాట పట్టారు. పంద్రాగస్టు కానుకగా గురువారం నాడు ఆహా ఓటీటీలో ‘ఎవోల్’ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

రెండు జంటల మధ్య నడిచే లవ్ స్టోరీతో ‘ఎవోల్​’ను రూపొందించారు. చిత్రంలో నటీనటులంతా కొత్తవారే. ఈ సినిమా ట్రైలర్ గతేడాది డిసెంబర్​లో రిలీజ్ అయింది. నెల రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టారు. కానీ సెన్సార్ అడ్డంకుల కారణంగా ఇప్పుడు ఓటీటీ బాట పట్టారు. ఆహా ఓటీటీ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఆగస్టు 15 నుంచి ‘ఎవోల్’ ప్రీమియర్స్ మొదలవుతాయని పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ ఫిల్మ్ ట్రైలర్ చూస్తుంటే ఈమధ్య కాలంలో ఇలాంటి కంటెంట్​తో రాని చిత్రంగానే కనిపిస్తోంది. అయితే సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగక తప్పదు. మరి.. ‘ఎవోల్’ను చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments