iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లోకి జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావ్!

  • Published Aug 12, 2024 | 7:47 PM Updated Updated Aug 12, 2024 | 7:47 PM

Bigg Boss Telugu Season 8 Contestants- Jabardasth Anchor Soumya Rao: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అంటూ చాలానే పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావ్ పేరు కూడా చేరింది.

Bigg Boss Telugu Season 8 Contestants- Jabardasth Anchor Soumya Rao: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అంటూ చాలానే పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావ్ పేరు కూడా చేరింది.

  • Published Aug 12, 2024 | 7:47 PMUpdated Aug 12, 2024 | 7:47 PM
బిగ్ బాస్ హౌస్ లోకి జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు కాకుండా.. ఏదైనా వైరల్ టాపిక్ ఉందా అంటే అది ఇదే. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ షో దాదాపుగా ఎప్పటిలాగానే సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం అవుతుంది అంటున్నారు. సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి దాదాపుగా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సీజన్ 8ని.. సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభిస్తారు అనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈసారి హౌస్ లోకి ఎవరు వస్తారు అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలానే పేర్లు ఆ లిస్టులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి ఇంకో కొత్త పేరు వచ్చి చేరింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఇప్పటి వరకు చాలానే పేర్లు వచ్చాయి. వాటిలో ఎంత మంది హౌస్ లోకి వస్తారు అనే విషయం మాత్రం ఆఖరి వరకు ఎవరూ చెప్పే పరిస్థితి ఉండదు. కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది పేర్లు దాదాపుగా ఖరారు అయిపోయాయి అంటూ చెబుతున్నారు. వాటిలో ప్రముఖంగా వేణుస్వామి, రీతూ చౌదరి, సీరియల్ ఆర్టిస్టులు అంజలి, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ, సీనియర్ నటి సనా, కమెడియన్ బంచిక్ బబ్లూ, కిరాక్ ఆర్పీ, రింగ్ రియాజ్, పాగల్ పవిత్ర ఇలా చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ లిస్టులోకి ఇప్పుడు ఒక యాంకరమ్మ వచ్చి చేరింది. జబర్దస్త్ కు యాంకర్ గా చేసిన సౌమ్యరావ్ ని కూడా బిగ్ బాస్ మేకర్స్ అప్రోచ్ అయ్యారు అని.. ఆమె కూడా హౌస్ లోకి వస్తోంది అంటూ చెబుతున్నారు.

సౌమ్యరావ్ జబర్దస్త్ యాంకర్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. ఆ తర్వాత ఎన్నో ప్రముఖ టాక్ షోస్, గేమ్ షోస్ లో కూడా పాల్గొంది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతోంది అంటున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది? ఇప్పటివరకు వైరల్ అవుతున్న పేర్లలో అసలు ఎవరు హౌస్ లోకి వెళ్తారు? అనే విషయంపై మాత్రం మనం అధికారికంగా ఏం చెప్పలేం. స్టేజ్ మీదకు వచ్చే వరకు వీళ్లే కన్ఫార్మ్ అయిన కంటెస్టెంట్ అని చెప్పేందుకు వీలు ఉండదు. అప్పటి వరకు ఇవి కేవలం పుకార్లు మాత్రమే అవుతాయి. ఈసారి షోని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు అని అర్థమవుతోంది.

ఆదివారం విడుదల చేసిన ప్రోమో చూశాక.. షో మీద అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈసారి కూడా ఉల్టా పుల్టా కాన్సెప్ట్, గ్రాండ్ లాంఛ్ 2.0 కూడా ఉంటుంది అంటున్నారు. గ్రాండ్ లాంఛ్ 2.0లో పాత సీజన్స్ నుంచి కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపుతారు అంటున్నారు. ప్రోమో ద్వారా కూడా అలాంటి సూచనలే ఇచ్చారు. ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్ టైన్మెంట్ కి లిమిటే లేదు అని చెబుతున్నట్లుగానే షో ఉంటుందని తెలుగు ప్రేక్షకులు అయితే నమ్ముతున్నారు. మరి.. బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ సౌమ్యరావ్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş