iDreamPost
android-app
ios-app

బెస్ట్ రివెంజ్ డ్రామా తుడరుమ్.. OTT స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

  • Published May 14, 2025 | 11:30 AM Updated Updated May 14, 2025 | 11:30 AM

చాలా వరకు సినిమాలన్నీ థియేటర్ లో విడుదలైన రెండు నెలలలోనే OTT స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం కాస్త లేట్ గ ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన విషయాలు చూసేద్దాం.

చాలా వరకు సినిమాలన్నీ థియేటర్ లో విడుదలైన రెండు నెలలలోనే OTT స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం కాస్త లేట్ గ ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published May 14, 2025 | 11:30 AMUpdated May 14, 2025 | 11:30 AM
బెస్ట్ రివెంజ్ డ్రామా తుడరుమ్..  OTT  స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ లో OTTల హావ ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు థియేటర్ లో రిలీజ్ అయినా నెల రెండు నెలలలోనే సినిమాలు OTT ల బాట పడుతున్నాయి. కొన్ని సినిమాలైతే ఏకంగా మూడు వారాలకే OTT ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. కానీ చాలా రేర్ గా కొన్ని సినిమాలు మాత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు చాలా సమయం తీసుకుంటాయి. అలాంటివాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సినిమా కూడా ఒకటి.

రీసెంట్ గా మలయాళంలో మోహన్ లాల్ నటించిన తుడరుమ్ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దక్కింది. ఇక ముందుగా ఈ సినిమాకు ఈ నెలాఖరు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్నా రెస్పాన్స్ చూసి ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారట మేకర్స్. గత నెల 25 న రిలీజ్ అయినా ఈ మూవీ ప్రస్తుతం రూ.200 కోట్ల వసూళ్లకు దగ్గరగా ఉంది. కేవలం ఒక్క కేరళలోనే ఈ మూవీ 100 కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డ్ సాధించింది. ఈ లెక్కన మరో రెండు మూడు వారాలు థియేటర్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉండడంతో.. OTT రిలీజ్ ను వాయిదా వేశారు మూవీ టీం. సో ప్రస్తుతానికి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వనట్టే. అయితే ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుందట. ఇక థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని OTT స్ట్రీమింగ్ డేట్ లాక్ చేయబోతున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.