iDreamPost
android-app
ios-app

This Week OTT Suggestion: ఈ వారం OTTలో చూడాల్సిన బెస్ట్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే!

  • Published Mar 10, 2024 | 4:45 PM Updated Updated Mar 14, 2024 | 3:57 PM

ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రతి వారం పదుల సంఖ్యలో వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా వాటికి ఆదరణ బాగా లభించడంతో.. మేకర్స్ కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. మరి, ఈ వారం ఓటీటీ లో విడుదలైన బెస్ట్ మూవీస్ ఏంటో చూద్దాం.

ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రతి వారం పదుల సంఖ్యలో వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా వాటికి ఆదరణ బాగా లభించడంతో.. మేకర్స్ కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. మరి, ఈ వారం ఓటీటీ లో విడుదలైన బెస్ట్ మూవీస్ ఏంటో చూద్దాం.

  • Published Mar 10, 2024 | 4:45 PMUpdated Mar 14, 2024 | 3:57 PM
This Week OTT Suggestion: ఈ వారం OTTలో  చూడాల్సిన బెస్ట్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే!

ఈ వారం థియేటర్ లో విడుదలైన .. గామి, భీమా, సైతాన్ సినిమాలు ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయని చెప్పి తీరాలి. ఈ మూడు సినిమాల గురించి అంతా హిట్ టాక్ ఏ వినిపిస్తుంది. థియేట్రీకల్ టాక్ తో పాటు.. ఈ సినిమాల ఓటీటీ పార్ట్నర్స్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. అప్పుడే ఈ సినిమాల ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వీటి సంగతి ఇలా ఉంటే.. ప్రతి వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ లో కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కాస్త మంచి సినిమాలు చూసి రిలాక్స్ అవ్వాలి అనుకునే వారికి.. ఇన్ని సినిమాలు, సిరీస్ లలో ఏది చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి అటువంటి వారి కోసమే ఈ ఓటీటీ మూవీస్ సజెషన్స్ . మరి ఈ వారం ఓటీటీ లో విడుదలైన సినిమాలు, సిరీస్ లలో బెస్ట్ ఏవో చూసేద్దాం.

1) షో టైమ్ వెబ్ సిరీస్:

ఈ “షోటైమ్” వెబ్ సిరీస్ కు.. మిహిర్ దేశాయ్, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే.. సినీ ఇండస్ట్రీలో వారసత్వం, వారసులపై ఉండే అంచనాలు, ఆశయాలు ఇటువంటివి! అసలు బాలీవుడ్ పరిశ్రమ తెర వెనుక జరిగే సంగతులేంటి అనే కాన్సెప్ట్ తో .. రూపొందించారు. నెపోటిజం గురించి, కింది నుంచి పైకి వచ్చేందుకు చేసే పోరాటం, ఉండే ఇబ్బందులు , పడే కష్టాలు .. వీటన్నంటి గురించి ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మీ, నసీరుద్దీన్ షా, నాగిని భామ మౌని రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 8నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో.. హిందీతోపాటు.. తెలుగులోను ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.

2) మెర్రీ క్రిస్మస్ :

ఈ సినిమా జనవరిలో థియేటర్ లో విడుదలయ్యి హిట్ టాక్ ను సంపాదించుకుంది. మెర్రీ క్రిస్మస్ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాను 1980 బొంబాయి కాలంలో జరిగినట్లుగా చూపించారు. ఆల్బర్ట్ (సేతుపతి) ముంబై నగరానికి క్రిస్మస్ రోజు తిరిగి వస్తాడు. అక్కడ ఒంటరిగా ఉన్న తల్లి మారియా (కత్రీనా కైఫ్), ఆమె కూతురుని క్రిస్మస్ ఈవ్‌లో కలుసుకుంటాడు. అక్కడ వాళ్లిద్దరి పరిచయం ఆ రాత్రి మారియా ఫ్లాట్‌ వెళ్లేవరకు వెళ్తుంది. కానీ, అక్కడుకు వెళ్లిన తర్వాత ఆ ఫ్లాట్ లో ఓ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ తర్వాత ఎం జరిగిందన్నదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 8 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో “మెర్రీ క్రిస్మస్” స్ట్రీమింగ్ అవుతోంది.

3) మహారాణి సీజన్ 3:

ఇదివరకు వచ్చిన మహారాణి రెండు సీజన్లు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీనితో ఇప్పుడు మహారాణి సీజన్ 3 ని కూడా రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. రాజకీయ ప్రత్యర్థులు, సొంత భర్త, కులం, లింగ వివక్షతో పోరాడి అధికారంలో కొనసాగే ముఖ్యమంత్రి .. ఇలా ఈ కథ కొనసాగుతుంది. బాలీవుడ్ గ్లామర్ బ్యూటి హ్యూమా ఖురేషి ముఖ్యమంత్రిగా ఈ సిరీస్ లో నటించారు. అలాగే రాణి భారతి (హ్యూమా ఖురేషి) మూడేళ్లపాటు జైలులో ఉంటే.. ఆమె రాజకీయ ప్రత్యర్థి నవీన్ (అమిత్ సియాల్) ముఖ్యమంత్రిగా ఉన్నారు. మార్చి 8 నుంచి మహారాణి సీజన్ 3 సోనీ లివ్‌లో ప్రసారం అవుతోంది.

4) డామ్‌సెల్:

డామ్‌సెల్ ఒక థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను స్పానిష్ దర్శకుడు జువాన్ కార్లోస్ ఫ్రెస్నాడిల్ తెరకెక్కించాడు. ఈ సినిమా కథ విషయానికొస్తే తన రాణి చెప్పినట్లుగా చేసే అందమైన యువతి బ్రౌన్ పెళ్లి వివాహం అనే కథాంశంతో కొనసాగుతుంది. ఆ తర్వాత తర్వాత బ్రౌన్ జీవితం ఎలా మారిపోయింది. బ్రౌన్ ఎలాంటి అడ్వెంచర్స్ చేసింది. ఎలా సర్వైవ్ అయింది అనేదే కథ. ఈ సినిమా మార్చి 8 నుంచి ఇంగ్లీషుతోపాటు స్పానిష్, తెలుగు, హిందీ ఇతర భాషల్లో.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరి, ఈ వారం ఓటీటీ లో చూసేందుకు వచ్చేసిన ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.