iDreamPost
android-app
ios-app

The Kerala Story: ఎట్టకేలకు OTTలోకి వచ్చేసిన ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ అందులోనే!

  • Published Feb 16, 2024 | 9:02 AM Updated Updated Feb 16, 2024 | 9:12 AM

ప్రేక్షకులతో పాటు మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదరుచూస్తున్న బ్లాక్​బస్టర్ ఫిల్మ్ ‘ది కేరళ స్టోరీ’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే..!

ప్రేక్షకులతో పాటు మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదరుచూస్తున్న బ్లాక్​బస్టర్ ఫిల్మ్ ‘ది కేరళ స్టోరీ’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే..!

  • Published Feb 16, 2024 | 9:02 AMUpdated Feb 16, 2024 | 9:12 AM
The Kerala Story: ఎట్టకేలకు OTTలోకి వచ్చేసిన ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ అందులోనే!

ఈ రోజుల్లో ఒక సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో.. ఓటీటీ విడుదల కోసం కూడా అంతే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా చిత్రాలు బిగ్​ స్క్రీన్స్​లో​ విడుదలైన తర్వాత దాదాపుగా 6 నుంచి 8 వారాల్లోపు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలైతే రిలీజైన నెలలోపే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఆడియెన్స్​ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తుండటం, షార్ట్ టైమ్​లో రిలీజ్ చేస్తే మంచి వ్యూస్ వస్తుండటంతో ఆ సంస్థలు కూడా సినిమాలను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని ఫిల్మ్స్ థియేటర్​లో రిలీజై నెలలు గడుస్తున్నా ఓటీటీలోకి రాట్లేదు. అలాంటి వాటిల్లో ఒకటి బ్లాక్​బస్టర్ హిట్ ‘ది కేరళ స్టోరీ’. గతేడాది మే 5న బిగ్ స్క్రీన్స్​లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్​కు ఇప్పటిదాకా మోక్షం లభించలేదు. దీంతో వెయిట్ చేసి చేసి ఆడియెన్స్​ నిరాశలో కూరుకుపోయారు. అయితే వారికో గుడ్ న్యూస్. ‘ది కేరళ స్టోరీ’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం..

దేశంలో చర్చనీయాంశంగా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రేజీ ఫిల్మ్ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సూపర్​హిట్​గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అదా శర్మ హీరోయిన్​గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీప్తోసేన్ తెరకెక్కించారు. కేరళలో 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించి వాళ్ల ఆచూకీ కనుక్కునే ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారు. నలుగురు యువతులు మతం మారి, ఆ తర్వాత ఐసిస్​లో చేరిన నేపథ్యంలో స్టోరీ సాగుతుంది. అయితే, తప్పిపోయిన అమ్మాయిలు మతం మారడం, టెర్రరిస్టు ట్రైనింగ్ తీసుకొని భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది.

‘ది కేరళ స్టోరీ’ చిత్రం ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కొంది. ఈ సినిమాను మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. అయితే మరికొన్ని రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఫేమస్ పొలిటికల్ లీడర్స్ దీని మీద పోస్టులు పెట్టడంతో గతేడాది ఈ ఫిల్మ్ చర్చనీయాంశంగా మారింది. పలు అనివార్య కారణాల వల్ల ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ కూడా డిలే అవుతూ వచ్చింది. థియేటర్లలో చూడని వారు ఈ సినిమాను ఓటీటీలో చూద్దామంటే అందుబాటులో లేకుండా పోయింది. దీంతో వాళ్లు ఎదురు చూడక తప్పలేదు. అయితే ఎట్టకేలకు తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది అదా శర్మ నటించిన ఫిల్మ్. మరి.. ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ కోసం మీరెంతగా ఎదురు చూశారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Chiranjeevi: ‘సుందరం మాస్టర్’ ట్రైలర్.. మెగాస్టార్ మాటలకు ఏడ్చేసిన వైవా హర్ష!