iDreamPost
android-app
ios-app

Chiranjeevi: ‘సుందరం మాస్టర్’ ట్రైలర్.. మెగాస్టార్ మాటలకు ఏడ్చేసిన వైవా హర్ష!

  • Published Feb 15, 2024 | 9:59 PM Updated Updated Feb 15, 2024 | 9:59 PM

సుందరం మాస్టర్ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మాటలకు ఏడ్చేశాడు నటుడు వైవా హర్ష.

సుందరం మాస్టర్ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మాటలకు ఏడ్చేశాడు నటుడు వైవా హర్ష.

  • Published Feb 15, 2024 | 9:59 PMUpdated Feb 15, 2024 | 9:59 PM
Chiranjeevi: ‘సుందరం మాస్టర్’ ట్రైలర్.. మెగాస్టార్ మాటలకు ఏడ్చేసిన వైవా హర్ష!

టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ నటీ, నటులు, టెక్నీషియన్స్ ఉన్నారు. తమ స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటుగా ఫ్యాన్ బేస్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ప్రతిభగల నటుల్లో ఒకడు వైవా హర్ష. తన ఓన్ టాలెంట్ తో షార్ట్ ఫిల్మ్ ల నుంచి వెండితెరకు పరిచయం అయ్యాడు. తాజాగా సోలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వైవా హర్ష నటించిన లేటెస్ట్ చిత్రం ‘సుందరం మాస్టర్’. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరూ మాట్లాడిన మాటలకు హర్ష కన్నీటి పర్యంతం అయ్యాడు.

వైవా హర్ష.. షార్ట్ ఫిల్మ్స్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నాడు. హీరోల ఫ్రెండ్ క్యారెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు హర్ష. ప్రస్తుతం అతడి నుంచి ఓ సినిమా వస్తోంది.’సుందరం మాస్టర్’ గా ఫిబ్రవరి 23న పాఠాలు చెప్పడానికి వస్తున్నాడు. RT టీం వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజతో పాటుగా సుధీర్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాగా.. తాజాగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ..”వైవా హర్ష లాంటి నటీ, నటులు ఇండస్ట్రీకి ఇంకా రావాలి. అతడు నాలాగే స్వయంకృషితో ఎదిగిన తీరు అద్భుతం. సోషల్ మీడియా తక్కువ ఉన్న కాలంలోనే తన వీడియోలతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ట్రైలర్ చూస్తుంటే ఈ పాత్ర తన కోసమే పుట్టినట్లుగా అనిపిస్తుంది. కొత్త కొత్త ప్రయోగాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని ప్రార్థిస్తున్నాను” అని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. చిరంజీవి మాట్లాడుతున్నంత సేపు వైవా హర్ష భావోద్వేగానికి గురైయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ.. కనిపించాడు. అనంతరం మాట్లాడిన వైవా హర్ష.. ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు. తనలాంటి చిన్న నటీ, నటులను, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు హర్ష. సరికొత్త కథతో రాబోతున్న సుందరం మాస్టర్ ప్రేక్షకుల అభిమానాలు పొందుతాడని ఆశాభావం వ్యక్తం చేసింది మూవీ టీమ్. మరి సుందరం మాస్టర్ ట్రైలర్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: RRR, బాహుబలి చిత్రాల సినిమాటోగ్రాఫర్ ఇంట విషాదం!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio