iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి మిల్కీబ్యూటీ మరో వెబ్ సీరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Feb 01, 2024 | 9:41 PM Updated Updated Feb 01, 2024 | 9:53 PM

Tamannaah is Another Web Series: ఒకప్పుడు వెండితెరపై నటించిన స్టార్ హీరోహీరోయిన్లు ఇప్పుడు వెబ్ సీరీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కుర్రాళ్ల మతులు పోగొట్టిన మిల్కీ బ్యూటీ మరో వెబ్ సీరీస్ కి సిద్దమైంది.

Tamannaah is Another Web Series: ఒకప్పుడు వెండితెరపై నటించిన స్టార్ హీరోహీరోయిన్లు ఇప్పుడు వెబ్ సీరీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కుర్రాళ్ల మతులు పోగొట్టిన మిల్కీ బ్యూటీ మరో వెబ్ సీరీస్ కి సిద్దమైంది.

  • Published Feb 01, 2024 | 9:41 PMUpdated Feb 01, 2024 | 9:53 PM
ఓటీటీలోకి మిల్కీబ్యూటీ మరో వెబ్ సీరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం బుల్లితెరపై ఓటీటీ జమానా నడుస్తుంది. ఒకప్పుడు శుక్రవారం వస్తుందంటే ధియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేసేవి.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వీక్ ఎండ్ అంటే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ల సందడి మొదలవుతుంది. దేశీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ స్ట్రిమింగ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు చూడని వారు ఓటీటీలో చూసుకునే అవకాశం లభిస్తుంది.. దాంతో పాటు క్రైమ్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ తో కూడిన వెబ్ సీరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో తన అందాలతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టిన మిల్కీ బ్యూటీ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా మరో కొత్త వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించింది. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టించింది మిల్కీ బ్యూటీ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. గత ఏడాది రజినీకాంత్ నటించిన జైలర్, మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ తో పాటు వెబ్ సీరీస్ లో నటించింది. కొంత కాలంగా వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా ఫోకస్ పెట్టింది మిల్కీ బ్యూటీ. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ తో కుర్రాళ్లకు కిక్కెంచేలా నటించింది. తాజాగా ఈ అమ్మడు మరో వెబ్ సీరీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియలో తెరకెక్కిస్తున్న ఈ సీరీస్ కామెడీ జోనర్ లో ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

తమన్నా ఒకప్పుడు సినీమాల్లో తన అభినయంతోపాటు అందాలతో ఆకట్టుకుంది. ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేసి మరింత బోల్డ్ సీన్స్ చేయడానికి వెనుకాడటం లేదు. గత ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చినే జి కర్ధా తో పాటు నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 లో బోల్డ్ సీన్లలో మతుపొగొట్టింది. ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ 2 లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తో హద్దులు దాటేలా లిప్ లాక్ సీన్ లో రెచ్చిపోయి నటించిందని టాక్. తాజాగా కామెడీ జోనర్ లో రాబోతున్న కొత్త వెబ్ సీరీస్ కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దం చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş