iDreamPost
android-app
ios-app

Shaitaan OTT: ఆ OTTలోకి అజ‌య్ దేవ్‌గ‌ణ్, మాధ‌వ‌న్‌ హార‌ర్ మూవీ

  • Published Mar 10, 2024 | 11:04 AM Updated Updated Mar 14, 2024 | 4:07 PM

బాలీవుడ్ లో హారర్ చిత్రాల చరిత్రను తిరగరాసిన సినిమా "సైతాన్". ఈ మూవీ మార్చి 8న థియేటర్ లో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లో హిట్ టాక్ తో దూసుకుపోతున్న క్రమంలో.. ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బాలీవుడ్ లో హారర్ చిత్రాల చరిత్రను తిరగరాసిన సినిమా "సైతాన్". ఈ మూవీ మార్చి 8న థియేటర్ లో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లో హిట్ టాక్ తో దూసుకుపోతున్న క్రమంలో.. ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 10, 2024 | 11:04 AMUpdated Mar 14, 2024 | 4:07 PM
Shaitaan OTT: ఆ OTTలోకి  అజ‌య్ దేవ్‌గ‌ణ్, మాధ‌వ‌న్‌ హార‌ర్ మూవీ

తాజాగా అజయ్ దేవ్‌గ‌ణ్‌, మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ “సైతాన్”. ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమాకు వికాస్ భ‌ల్ దర్శకత్వం వహించారు. సూపర్ న్యాచురల్ హర్రర్ కథాంశంతో.. ఈ సినిమా తెరక్కెక్కింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్ హీరోగా కనిపించగా, మాధ‌వ‌న్ విల‌న్‌గా నటించాడు. సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగిన విలన్ గా.. డిఫరెంట్ షేడ్స్ లో.. మాధవన్ ఆడియన్సు ను భయపెట్టడని చెప్పి తీరాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మార్చి 8న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా .. అంతటా పాజిటీవ్ టాక్ ను సంపాదించుకుంది. సినిమా విడుదలై రెండు రోజులు కూడా కాకముందే.. అప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ వినిపిస్తోంది. మరి, సైతాన్ సినిమా ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

సైతాన్ సినిమా ట్రైలర్ విడుదల చేసిన తర్వాత .. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక విడుదల తర్వాత ..ఫస్ట్ డే కలెక్షన్స్ లో 12 ఏళ్ళ బాలీవుడ్ సినీ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా సైతాన్ మూవీ 14.50 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్రత్యేకించి అజయ్ దేవగణ్ , జ్యోతిక నటనతో.. వచ్చిన ట్విస్ట్స్ , హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను.. బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను గుజరాతి రీమేక్ గా రూపొందించిన సంగతి తెలిసిందే. సైతాన్ సినిమాకు వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహించారు. ఇక సైతాన్ మూవీకి అజయ్ దేవ్‍గణ్, జ్యోతీ దేశ్‍పాండే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ..ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేసుకుందట. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయినా తర్వాత.. ఈ సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు .. నెట్ ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుంది. అంటే థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సైతాన్ చిత్రం రానుంది.

ఇక సైతాన్ మూవీ కథ విషయానికొస్తే.. క‌బీర్ (అజ‌య్ దేవ్‌గ‌ణ్‌), అతని భార్య జ్యోతి(జ్యోతిక‌) త‌మ కూతురు జాన్వీతో క‌లిసి ఓ విలేజ్‌కు హాలీడే ట్రిప్ కు వెళ్తారు. వెళ్లే దారిలో వారికి ఓ స్నేహితుడిగా.. క‌బీర్‌కు ప‌రిచ‌యం అవుతాడు వ‌న్‌రాజ్ (మాధ‌వ‌న్‌). ఈ క్రమంలో కూతురు జాన్వీ (జానకి)కి ఓ విషపూరితమైన పదార్థం ఇస్తాడు వన్ రాజ్. ఇక అతని రాకతో క‌బీర్ ఫ్యామిలీ క‌ష్టాల్లో ప‌డుతుంది. తన మాయ, మంత్రాలతో క‌బీర్ ఫ్యామిలీని వ‌న్‌రాజ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? అసలు ఆ సైకో వన్ రాజ్ ఎవరు ! ఈ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడు! అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. మరి, “సైతాన్” సినిమా ఓటీటీ అప్ డేట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.